Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. రెండు తెలుగు రాష్ట్రాలకు పవన్ సాయం ఎంతంటే?

By:  Tupaki Desk   |   26 March 2020 4:42 AM GMT
కరోనా వేళ.. రెండు తెలుగు రాష్ట్రాలకు పవన్ సాయం ఎంతంటే?
X
కరోనా రక్కసిపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి ఆర్థికదన్ను చాలా అవసరమెంతో. ఇప్పటివరకూ ఎన్నో విపత్తులు చూసినా.. కరోనా లాంటిది చాలా అరుదైనది. ఇలాంటివి మానవాళిలో అత్యంత అరుదుగా వచ్చే సందర్భాలు. ఇలాంటివేళ.. ఎలా వ్యవహరించాలన్న దానిపై పెద్ద మనసు చాలా అవసరం. ఇజాల్ని పక్కన పెట్టేసి.. అందరి కోసం తన వంతు సాయం చేయాలన్న తపన చాలా అవసరం. అలాంటి గుణం తనలో టన్నుల కొద్దీ ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు పవన్ కల్యాణ్.

తాజాగా కరోనా విపత్తు వేళ.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు ఆర్థిక సాయంగా రూ.50 లక్షల చొప్పున ప్రకటిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. పవన్ తీసుకున్ననిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివి పవన్ లాంటోడు మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరని పేర్కొంటే.. మరొకరు ఒక అడుగు ముందుకేసి.. అందుకే కదా మీరంటే ఇంత పిచ్చి.. అంటూ తమ అభిమానాన్ని చాటేశారు. పవన్ ప్రకటనపై జబర్దస్త్ నటుడు హైపర్ ఆది సోషల్ మీడియాలో స్పందిస్తూ.. గురువుగారు.. మీ నిర్ణయానికి నోటి వెంట మాటలు రావట్లేదు.. అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. పవన్ లాంటి నటుడు కమ్ రాజకీయనాయకుడు అలా అరుదుగా చెప్పాలి. పొగడాల్సిన అవసరం లేదు..ఇప్పుడు గొప్ప అని చెబుతున్న పవన్ తీసుకున్న నిర్ణయాల్లో తప్పుల్ని బండకేసి బాదినట్లుగా రాసిన వారిలో నేనూ ఒకడిని. ఎప్పుడైనా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాల్సిన వచ్చినప్పుడు.. ఒక వ్యక్తిలో ఉండే తప్పుప్పొప్పుల్ని చూపించే పాత్రికేయ జీవితంలో ఉన్నప్పుడు.. వాస్తవాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చేస్తున్నది ఇదే.

తన అభిమాని, హీరో అయిన్ నితిన్ ఇప్పటికే రెండు రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళం ఇవ్వగా... ఆలస్యంగా స్పందించిన పవన్ తన స్థాయికి తగ్గట్టే స్పందించాడు. ఇటీవలే ఆర్మీకి కోటి రూపాయలు ఇచ్చిన పవన్ తాజాగా రెండు రాష్ట్రాలకు కోటి ఇచ్చారు. మరోవైపు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీకి పది, తెలంగాణకు పది లక్షలు ప్రకటించారు. త్వరలో వీటిని ఆయా ముఖ్యమంత్రులకు పంపనున్నారు.