Begin typing your search above and press return to search.
ఎన్నికల ముందు పవన్ సినిమా
By: Tupaki Desk | 7 Sept 2018 4:15 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జనసేనాని పూర్తిగా ఎన్నికల రణరంగంలోకి దిగిపోయాడు. నిరంతరం జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల్లోకి వెళుతూ సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఈ యుద్ధం ప్రారంభించాడు. అయితే పవన్ ఎన్నికలకు ముందే ఏదైనా సినిమాలో నటించే అవకాశం ఉందా? అంటే .. ఇదిగో ఇదే సమాధానం.
వాస్తవానికి అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత పవన్ వేరొక సినిమాలో నటించనున్నాడని ప్రచారమైంది. సంతోష్ శ్రీనివాస్ - మైత్రి మూవీస్ కాంబినేషన్ లో ఈ సినిమా ఉంటుందని మాట్లాడుకున్నారు. అయితే పవన్ ఊహించని రీతిలో తాను తీసుకున్న అడ్వాన్స్ ని వెనక్కి ఇచ్చేసి బ్రేకిచ్చేశాడు. పవన్ కి నటించే ఉద్ధేశం లేదని చెప్పుకున్నారు. అదంతా అటుంచితే.. పవర్ స్టార్ ఇప్పుడు మరోసారి ఓ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారని తెలిసి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల ముందే పవన్ సినిమా చేస్తారు. అయితే అందులో తాను నటించరు. కేవలం నిర్మాతగా మాత్రమే కొనసాగుతారు. మేనల్లుడు సాయిధరమ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటించే సినిమాని నిర్మిస్తాడట. ఒకవేళ ఇదే నిజమైతే రెండో మేనల్లుడికి పవన్ అండా దండా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. సాయిధరమ్ తొలి సినిమాకి పవన్ ఎంతో సాయం చేశారు. మేనల్లుళ్లు అంటే పవన్ కి ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కి ఇది కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రెండో మేనల్లుడులోనే అభిమానులు పవన్ ని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట!