Begin typing your search above and press return to search.

ఈసారి కొత్త పవన్ ను చూడబోతున్నామట

By:  Tupaki Desk   |   7 Nov 2015 7:28 AM GMT
ఈసారి కొత్త పవన్ ను చూడబోతున్నామట
X
టాలీవుడ్ హీరోల్లో పవన్ అదో టైపు. తన సినిమాల గురించి ఎప్పుడూ ఓ ఇంటర్వ్యూలిచ్చింది లేదు. ఇంకే రకంగానూ ప్రమోట్ చేసింది లేదు. ఇంతకుముందు ఆడియో పంక్షన్ లకు కూడా వచ్చేవాడు, వచ్చినా పెద్దగా మాట్లాడేవాడు కాదు. కానీ ఈ మధ్య కొంచెం నోరు విప్పుతున్నాడు. ఐతే అప్పుడు కూడా సినిమా గురించి, అందులోని విశేషాల గురించి మాట్లాడేది చాలా తక్కువ. ఇలా తన సినిమాను ప్రమోట్ చేయకుండానే ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఘనత పవర్ స్టారుదే. మరి సినిమాను బాగా ప్రమోట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఐతే పవన్ కూ ఈ ఆలోచనే వచ్చిందని.. అతను ఫస్ట్ టైం తన సినిమాను ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు సన్నిహితులు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ప్రమోషన్ లలో యూనిట్ సభ్యులతో పాటు పవన్ పాల్గొంటాడట. ఏప్రిల్ 8న విడుదలవుతుందని భావిస్తున్నఈ సినిమాను ఫిబ్రవరికే పూర్తి చేస్తారట. నెల రోజుల ముందు నుంచి ప్రమోషన్స్ మొదలవుతాయట. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్.. ప్రమోషన్ కోసం భారీ ప్రణాళికలతో ఉందట. అందులో భాగంగా పవన్ తోనూ ప్రమోషన్స్ చేయించడం, ఇంటర్వ్యూలు ఇప్పించడం చేస్తారట. వంద కోట్ల షేర్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ చిత్ర యూనిట్.. ఆ టార్గెట్ అందుకునేలా అగ్రెసివ్ ప్రమోషన్లు చేయబోతోందంట.

బాహుబలి - శ్రీమంతుడు సినిమాల రేంజి పెరగడానికి మార్కెటింగ్, ప్రమోషన్ స్ట్రాటజీ బాగా ఉపయోగపడింది. ఇంతకుముందు మహేష్ కూడా పవన్ లాగే సైలెంటుగా ఉన్నవాడే. కానీ ఇప్పుడిప్పుడే అతడికి ప్రమోషన్ వల్ల కలిగే ప్రయోజనం తెలిసొస్తోంది. పవన్ లోనూ మహేష్ లాగే మార్పు చూడబోతున్నామన్నమాట. తమ సినిమాలకు ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుందని.. తాము ప్రత్యేకంగా ప్రమోట్ చేయాల్సిన పని లేదు అన్నది మన స్టార్ హీరోల నమ్మకం. కానీ గత కొన్నేళ్లలో వాళ్ల ఆలోచన మారింది. బాలీవుడ్ లో అమీర్ - షారుఖ్ - సల్మాన్ లాంటి హీరోలకేమైనా తక్కువ ఫాలోయింగ్ ఉందా? వాళ్లెందుకు ప్రమోట్ చేస్తున్నారో మనోళ్లకు ఇప్పుడు బాగానే అర్థమవుతున్నట్లుంది.