Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క్రేజీ స్టెప్పుల‌కు రెడీ అయిపోండి

By:  Tupaki Desk   |   5 April 2016 5:15 PM GMT
ప‌వ‌న్ క్రేజీ స్టెప్పుల‌కు రెడీ అయిపోండి
X
తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందాలంటే డ్యాన్సుల్లో అద‌ర‌గొట్టాల్సిందే. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త స్టెప్స్ తో అల‌రించాల్సిందే. చిరంజీవి అలాంటి ప్ర‌మాణాలు నెల‌కొల్పాడు టాలీవుడ్లో. ఐతే చిరు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం డ్యాన్సుల మీద పెద్ద‌గా దృష్టిపెట్ట‌డు. ప‌వ‌న్ బ్యాడ్ డ్యాన్స‌ర్ కాదు కానీ.. గ్రేట్ డ్యాన్స‌ర్ మాత్రం కాదు. ఏదో ఓ మోస్త‌రుగా డ్యాన్సులు లాగించేస్తుంటాడు. ఐతే త‌న కొత్త సినిమా ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’లో మాత్రం ప‌వ‌న్ డ్యాన్సుల మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన‌ట్లు స‌మాచారం. ఇందులో ప‌వ‌న్ కొన్ని క్రేజీ స్టెప్పులు ట్రై చేసిన‌ట్లు తెలుస్తోంది.

దేవిశ్రీ ప్ర‌సాద్ మాస్ ట్యూన్ల‌కు త‌గ్గ‌ట్లుగా డ్యాన్స్ మాస్ట‌ర్లు ఎల‌క్ట్రిఫైయింగ్ స్టెప్పులు కంపోజ్ చేశార‌ట‌. ప‌వ‌న్ కూడా త‌న వంతుగా బాగానే క‌ష్ట‌ప‌డి డ్యాన్సులేశాడ‌ట‌. ప‌వ‌న్ కెరీర్లోనే డ్యాన్సుల ప‌రంగా స‌ర్దార్ బెస్ట్ మూవీస్ లో ఒక‌టి అవుతుంద‌ని అంటున్నారు యూనిట్ స‌భ్యులు. ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ మూవీని అభిమానుల‌కే అంకిత‌మిచ్చిన నేప‌థ్యంలో ప‌వ‌న్ వాళ్ల‌కు న‌చ్చే ఏ అంశాన్నీ వ‌ద‌ల్లేద‌ట‌. అందుకే డ్యాన్సులు కూడా ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకున్నాడ‌ట‌. ఆల్రెడీ ప‌వ‌న్ వేసిన చిరు వీణ స్టెప్పు విష‌యంలో చాలా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక పాట‌ల్లోనూ ప‌వ‌న్ మంచి స్టెప్పులు వేసి ఉంటే అభిమానుల‌కు పండ‌గే అన్న‌మాట‌.