Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ డేకి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   21 Jan 2023 12:30 PM GMT
రిపబ్లిక్ డేకి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక పీరియాడిక్ జోనర్ లో కాకతీయుల కాలం నాటి కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో వీరమల్లు అనే బందిపోటు దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.

దారిదోపిడీలు చేస్తూ పేదలకి పెట్టె హీరోయిక్ పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ టీజర్ ని ప్రేక్షకులకి అందించారు. దానికి మంచి స్పందన వచ్చింది. మూవీలో పోరాట ఘట్టాలు ఇంటరెస్టింగ్ గా ఉంటాయనే మాట గట్టిగా వినిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగష్టులో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి దర్శకుడు క్రిష్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే అతను షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక పోరాట ఘట్టాలు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ నెలలో అదిరిపోయే అప్డేట్ ఇవ్వడానికి దర్శకుడు క్రిష్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజు ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేయనున్నట్లు టాక్.

పవన్ కళ్యాణ్ మూవీకి బజ్ రావడానికి ఒక టీజర్, ఒక ట్రైలర్, ఒక సాంగ్ వదిలితే చాలు ప్రమోషన్ చేయకుండానే సినిమాకి కావాల్సినంత హైప్ వస్తుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాకి మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో ఈ టీజర్ తో మరోసారి ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.