Begin typing your search above and press return to search.
జనసేన కోసం JTV వస్తోందా?
By: Tupaki Desk | 20 April 2018 8:59 AM GMTపవన్ కళ్యాణ్ ఇప్పుడు మహా గుస్సా అయిపోయిన మాట వాస్తవం. వరుసగా ఆయన పెట్టిన ట్వీట్స్ చూస్తేనే ఈ విషయం అర్ధమయిపోతుంది. శ్రీరెడ్డి వ్యవహారంలో తప్పంతా తనదే అంటూ రాంగోపాల్ వర్మ ఒప్పుకున్నా.. దీని వెనక రాజకీయ కోణం ఉందన్నాడు జనసేన అధినేత. అయితే.. ఇదంతా మీడియా సపోర్ట్ తో జరుగుతోందని కూడా చెప్పుకొచ్చాడు.
ఇప్పటివరకూ పవన్ కు అండగా ఒక్క ఛానల్ కూడా నిలబడి లేదనే మాట నిజమే. ఆ లోటు విషయం పవన్ కు కూడా ముందే తెలుసు కానీ.. ఓ మీడియా ఛానల్ ప్రారంభించాలనే పాయింట్ ను మాత్రం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆలోచన ఓ కొలిక్కి వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో జే టీవీ అనే ఓ బ్యానర్ చక్కర్లు కొడుతోంది. 'జనం కోసం' ఇది ఛానల్ పేరు కాగా.. 'మీ కోసం.. మీ తోడుగా..' ఈ క్యాప్షన్ తో జే టీవీ అనే ఛానల్ రాబోతోందని ఈ పోస్టర్ సారాంశం. ఇందులో వాస్తవం ఎంత అనే విషయం ఇప్పటివరకూ క్లారిటీ లేదు.
కానీ లోగో డిజైన్ నుంచి.. బ్యానర్ లో కనిపిస్తున్న మిగిలిన అంశాలు పరిశీలిస్తే మాత్రం.. ఇది జనసేనకు అండగా నిలబడే ఉద్దేశ్యమే ఈ ఛానల్ వెనుక ఉంది అనిపించక మానదు. పవన్ కు సన్నిహితుడు.. గతంలో ఛానల్ నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాత.. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే జే టీవీ రాబోతోందనే టాక్ అయితే గట్టిగానే ఉంది. మరి ఈ జేటీవీ లో వాస్తవం ఎంతో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.