Begin typing your search above and press return to search.

బాలయ్య.. పవన్.. అన్ స్టాపబుల్ ఎంట్రీ..!

By:  Tupaki Desk   |   27 Dec 2022 7:15 AM GMT
బాలయ్య.. పవన్.. అన్ స్టాపబుల్ ఎంట్రీ..!
X
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ బాలకృష్ణ కనిపించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బాలయ్య, పవన్ అసలు ఈ కాంబోనే రచ్చ రంభోలా అనిపిస్తుంది. ఇద్దరు ఒకసారి కలిస్తే చాలు అనుకునే మూమెంట్ ఇది.. అలాంటిది ఇద్దరు కలిసి ఒక షో లో పాల్గొంటే.. అది కూడా బాలకృష్ణ ప్రశ్నలకు పవన్ సమాధానం చెబుతుంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

అన్ స్టాపబుల్ సీజన్ 2 లో భారీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఇప్పుడు పవన్, బాలకృష్ణ కలయిక వెనకాల కూడా ఆయనే ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ అటు నందమూరి అభిమానులకు, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ అందిస్తుందని చెప్పొచ్చు. రీసెంట్ గా ప్రభాస్ ఎపిసోడ్ తోనే ఈ సీజన్ కి ఈ ఒక్క ఎపిసోడ్ చాలు అనిపించేలా చేసిన ఆహా టీం ఇప్పుడు పవన్ ఎపిసోడ్ తో ఆ క్రేజ్ డబుల్ అయ్యేలా చేసింది.

హోస్ట్ సీట్ లో బాలకృష్ణ, హాట్ సీట్ లో పవన్ కళ్యాణ్.. వీరి మధ్య ఎలాంటి చిట్ చాట్ జరిగింది. అసలు వీరిద్దరు ఏమేమి మాట్లాడుకున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో వీరి పాత్ర ఎలా ఉండబోతుంది. జనసేన పై బాలకృష్ణ కామెంట్ ఏంటి.

పవన్ సినిమాల గురించి బాలయ్య ఎలా స్పందించారు లాంటి విషయాలను ఈ ఎపిసోడ్ తో క్లారిటీ ఇవ్వనున్నారు. కొన్ని కాంబినేషన్స్ ఒక చోట కలిస్తే వచ్చే వైబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. జస్ట్ ఎపిసోడ్ షూట్ తోనే అన్నపూర్ణ స్టూడియో ఆడిటోరియం మొత్తం హుశారెత్తేలా చేశారట.

మరి అన్ స్టాపబుల్ ఈ పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇంకెలా ఉంటుందో.. ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పవన్, బాలయ్య ఈ ఇద్దరిని ఒకే ఫ్రేంలో చూస్తే చాలు ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అన్నట్టే లెక్క. ఇదే ఊపు మీద ఈ ఇద్దరికి కలిసి ఓ మల్టీస్టారర్ కథ రాసేస్తే ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టే సినిమా అవుతుందని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.