Begin typing your search above and press return to search.
పవన్ టైమింగ్ చూసి షాకవుతున్నారు!
By: Tupaki Desk | 4 Jun 2021 11:30 PM GMT‘‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికి.. పార్టీని నడుపుకోవడానికి నాకు తెలిసిన విద్య నటించడమే’’ అన్నారు పవన్ కల్యాణ్. ఈ కారణంగానే.. రాజకీయాల్లో వెళ్లిన పవర్ స్టార్, వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇచ్చారు. క్వాలిటీ విషయాన్ని దర్శకులకు వదిలేస్తున్న పవన్.. క్వాంటిటీని పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన నాలుగు సినిమాల్లో వకీల్ సాబ్ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన మూడు సినిమాలను కూడా శరవేగంగా పూర్తిచేసి, మరికొన్ని చిత్రాలను లైన్లోకి తేవాలని చూస్తున్నారట.
ప్రస్తుతం రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ కాగా.. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న పీరియాడికల్ ఎంటర్ టైనర్ ‘హరిహర వీరమల్లు’ రెండవది. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్ మూవీ లైన్లోకి రానుంది. అయితే.. ఈ రెండు చిత్రాల మేకర్స్ కు కూడా స్పష్టమైన సూచనలు చేశాడట పవన్. సాధ్యమైనంత త్వరగా సినిమాలను పూర్తిచేయాలని చెప్పాడట.
ఇక, పవన్ షూటింగులకు డేట్స్ తక్కువగానే ఇచ్చాడని టాక్. అదే సమయంలో తన వీలును బట్టి సెట్స్ కు వస్తాడన్న ప్రచారమూ ఉంది. దీనికి తగ్గట్టుగా దర్శకులు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలో ఏకే రీమేక్ కు కేవలం 40 రోజుల డేట్స్ ఇచ్చాడట పవర్ స్టార్. తన పార్ట్ మొత్తం నెల పదిరోజుల్లోనే కంప్లీట్ చేయాలని చెప్పాడట. అటు హరిహర వీరమల్లు ను కూడా తక్కువ డేట్స్ తోనే ముగించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ సగం పూర్తయినట్టు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల తర్వాత సైన్ చేసే ప్రతిమూవీనీ ఇదేవిధంగా శరవేగంగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట పవన్. హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న సినిమాను కేవలం 60 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ మరింతగా సద్దుమణిగితే.. జూలైలో లేదా ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. మొదలు పెడితే.. ఏకధాటిగా షూట్ కంటిన్యూ చేసి, సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్నారట.
కరోనా సెకండ్ వేవ్ విజృంభించే నాటి వరకూ ఏకే రీమేక్, వీరమల్లు సెట్స్ కు షిఫ్ట్ ల వారీగా వెళ్లేవాడు పవర్ స్టార్. ఉదయం ఒక షూటింగులో, మధ్యాహ్నం మరో సెట్ కు హాజరయ్యారు. ఇప్పుడు షూటింగులు స్టార్ట్ అయితే.. ఇదే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హరీష్ శంకర్ చిత్రం తర్వాత పూరీజగన్నాథ్ ‘జనగణమన’ చిత్రం చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. వీటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.