Begin typing your search above and press return to search.

ఆగష్టు 15న రావాలని చూస్తున్న వకీల్ సాబ్..!

By:  Tupaki Desk   |   19 April 2020 8:53 AM GMT
ఆగష్టు 15న రావాలని చూస్తున్న వకీల్ సాబ్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' 'ఎంసీఏ' చిత్రాల డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కెరీర్ లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని బడా నిర్మాతలు దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా మొదలైన కొన్ని రోజులకే నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఆయన ప్లానింగ్‌ కు తగ్గట్లే షూటింగ్ ప్రతీ షెడ్యూల్ ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతూ వచ్చింది. పవర్ స్టార్ కూడా వరుసగా ఈ సినిమాకు డేట్లు కేటాయించి చకచకా షూటింగ్ పూర్తయ్యేలా సహకరించాడు. అలాంటి టైంలోనే కరోనా మహమ్మారి వచ్చి అడ్డుపడి షూటింగ్ కి బ్రేక్ వేసింది.

లాక్ డౌన్ కారణంగా మేలో అసలు థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. కొన్ని రోజుల షూటింగ్ కూడా పెండింగ్ ఉండటంతో ‘వకీల్ సాబ్’ ఇప్పుడిప్పుడే రిలీజయ్యేలా కనిపించడం లేదని.. 'వకీల్ సాబ్' దసరాకు వాయిదా పడ్డట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం జూన్ నెలాఖరు వరకు థియేటర్లు మూతపడే ఉంటే..'వకీల్ సాబ్'ను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. థియేటర్లు వెంటనే తెరుచుకోకున్నా జూన్‌ లో షూటింగులు మాత్రం కచ్చితంగా ప్రారంభం అవుతాయని.. మిగిలిన భాగం షూటింగ్ కి నెల రోజులు మాత్రమే సమయం పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.

అందులోను పవర్ స్టార్ కేవలం 8 రోజుల డేట్లు కేటాయిస్తే ఆయన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవుతుందట. రిమైనింగ్ షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసి.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి.. స్వాతంత్ర దినోత్సవ కానుకగా సినిమాను రిలీజ్ చేద్దామని దిల్ రాజు అండ్ టీమ్ భావిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా సోషల్ మెసేజ్ తో వస్తున్న సినిమా కూడా కావడంతో ఆగస్టు 15కు ఇది పర్ఫెక్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఆగష్టు 15 డేట్ లాక్ చేసి పెట్టుకున్న సినిమాల గురించి కూడా ఇక్కడ ఆలోచించాలి. మరి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.