Begin typing your search above and press return to search.
పవన్ డైరెక్టరుకి వార్నింగ్ ఇచ్చాడా?
By: Tupaki Desk | 25 Sep 2015 11:30 AM GMTపవన్ కళ్యాణ్ కు అందరు డైరెక్టర్ లతో సింక్ కాదంటారు. తనతో పని చేసే డైరెక్టర్ లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. తన దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే అస్సలు సహించడని అంటుంటారు. ఈ సంగతి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డైరెక్టర్ బాబికి ఇప్పుడిప్పుడే తెలుసొస్తోందట. రెండేళ్ల కిందట మొదలవ్వాల్సిన గబ్బర్ సింగ్ సీక్వెల్.. అనేక అవాంతరాల్ని దాటుకుని.. ఈ మధ్యే సెట్స్ మీదికి వెళ్లింది. ఇంతలోనే సీనియర్ సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ సడెన్ గా సినిమా నుంచి బయటికెళ్లిపోయాడు. పవన్ కళ్యాణ్ కు ఆప్తుడైన టెక్నీషియన్ జయనన్. బద్రి దగ్గర్నుంచి గబ్బర్ సింగ్ వరకు పవన్ నటించిన చాలా సినిమాలకు ఆయనే ఛాయాగ్రాహకుడు. అలాంటి వాడు సినిమా మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
జయనన్ తప్పుకోవడానికి అనారోగ్యమే కారణమని వార్తలొచ్చాయి కానీ.. అదేమీ కాదని.. డైరెక్టర్ బాబితో విభేదాలే కారణమని తెలుస్తోంది. బాబితో ఇగో క్లాషెస్ వల్లే జయనన్ తప్పుకోవాల్సి వచ్చిందని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. జయనన్ కంటే ముందు ఓ సీనియర్ కో డైరెక్టర్ సైతం బాబి ధాటికి టాటా చెప్పేసినట్లు తెలిసింది. కో డైరెక్టర్ విషయాన్ని పెద్దగా పట్టించుకోని పవన్.. తనకు ఆప్తుడైన జయనన్ విషయంలో మాత్రం బాబి మీద ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో బాబికి పవన్ వార్నింగ్ కూడా ఇచ్చాడని.. ఓ రోజు షూటింగ్ మధ్యలోంచి వెళ్లిపోయాడని చెబుతున్నారు. ఇప్పటికే లేనిపోని ఇబ్బందులతో సర్దార్ గబ్బర్ సింగ్ చాలా ఆలస్యమైంది. ఇప్పుడు హీరో, డైరెక్టర్ మధ్యే విభేదాలంటే సినిమా ఏమవుతుందో ఏంటో?