Begin typing your search above and press return to search.
రంగస్థలం థియేటర్ లో పవన్ వైఫ్
By: Tupaki Desk | 9 April 2018 5:21 PM GMTరామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం సెన్సేషనల్ సక్సెస్ సాధించి.. రెండో వారాంతంలో కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టించడం చూస్తూనే ఉన్నాం. సెకండ్ సండే నాడు రికార్డు కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. నాన్ బాహుబలి రికార్డు వైపు దూసుకుపోతోంది. ఆడియన్స్ అందరినీ మెప్పించిన రంగస్థలం.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా థియేటర్ బాట పట్టించింది.
తన సినిమాలు తను చూసేందుకే అంతగా ఇష్టపడని పవన్ కళ్యాణ్.. రంగస్థలం చూసేందుకు మాత్రం తన భార్య అనా లెజ్నోవాతో కలిసి థియేటర్ కు రావడం విశేషం. బాబాయ్ కోసం ఇవాళ సాయంత్రం సినిమాక్స్ లో స్పెషల్ షో ఏర్పాటు చేయించాడు రామ్ చరణ్. తను కేవలం స్క్రీనింగ్ ఏర్పాటు చేయడమే కాదు.. బాబాయ్ తో కలిసి తను కూడా సినిమా చూస్తున్నాడు చెర్రీ. మూవీలోని ప్రతీ ఫ్రేమ్ ను చూసి పవన్ ఎంజాయ్ చేశాడని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్ ట్యాలెంట్ ను స్పెషల్ గా అబ్జర్వ్ చేశాడట.
అంతేకాదు.. డీటైలింగ్ విషయంలో సుకుమార్ చూపించిన ప్రతిభ పవర్ స్టార్ ను బాగా మెప్పించిందని తెలుస్తోంది. మూవీలో పొలిటికల్ యాంగిల్ ఉన్నా.. దాన్ని ఫ్యామిలీ కంటెండ్ కి మిక్స్ తెరకెక్కించిన తీరును పవన్ ప్రత్యేకంగా అభినందించాడట. ఇక చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో చెర్రీ ఒదిగిపోయిన తీరుకు.. పవన్ తెగ మురిసిపోతున్నాడట. తన పాతిక సినిమాల కెరీర్ లో ఇలాంటి సినిమా రాలేదే అనే ఫీలింగ్ ను కూడా వ్యక్తం చేశాడని టాక్.