Begin typing your search above and press return to search.
శ్రీజ మ్యారేజ్ లో పవన్ భార్య సందడి
By: Tupaki Desk | 2 April 2016 7:02 AM GMTచిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి ఆత్మీయ సన్నిహితులు - బంధువులు అంతా హాజరయ్యారు. అయితే.. శ్రీజ బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలో భాగం కాలేకపోయాడు. ఆ సమయంలో పవన్ స్విట్జర్లాండ్ లో ఉండడంతో. శ్రీజ పెళ్లిలో పాల్గొనలేకపోయాడు పవన్ కళ్యాణ్.
పవన్ పెళ్లికి రాలేదు కానీ.. పవన్ మూడో భార్య అన్నాలెజ్నోవా మాత్రం శ్రీజ పెళ్లికి హాజరు కావడం విశేషం. సాధారణంగా చిరు ఫ్యామిలీ వేడుకల్లో కనిపించిన ఈమె.. శ్రీజ పెళ్లిలో మాత్రం ఆద్యంతం కనిపించింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి, రెండూ పాటల షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాల్సిరావడం కారణంగా, తను హాజరు కాలేని పరిస్థితి ఉండడంతో.. భార్యను ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా చెప్పాడు పవన్. ఈమె రష్యా యువతి అయినా.. భారతీయ సంప్రదాయ వేడుకలో పాల్గొంటూ.. అచ్చమైన భారత సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకుంది.
చిరు కుటుంబ సభ్యులు అందరితోనూ బాగా కలిసిమెలిసి తిరిగిందని అంటున్నారు. చిరంజీవి భార్య సురేఖ పక్కనే ఎక్కువగా కనిపించడం విశేషం. మొత్తానికి అన్నయ్య కూతురు పెళ్లికి తను హాజరు కాలేకపోయిన బాబాయ్ పవన్ కళ్యాణ్.. పిన్నిని మాత్రం పంపించి, ఆ లోటు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడని అంటున్నారు.