Begin typing your search above and press return to search.

పవన్ విష్ చేశాడు.. ఇక అభిమానులు ఆపండి

By:  Tupaki Desk   |   26 Jun 2018 6:24 AM GMT
పవన్ విష్ చేశాడు.. ఇక అభిమానులు ఆపండి
X
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రేణు నుంచి విడిపోయిన కొన్నేళ్లకే పవన్ మరో మహిళతో రిలేషన్షిప్ మొదలుపెట్టాడు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ రేణు మాత్రం ఏడేళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. ఇప్పుడామె మరో తోడు వెతుక్కుంటే ఆమెను తిట్టి పోస్తున్నారు కొందరు పవన్ అభిమానులు. ఇదెంతవరకు న్యాయం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిమానుల్ని నిలువరించడానికి పవన్ ఈ విషయంలో ఒక ట్వీట్ అయినా చేయాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఇలాంటి విషయాల్లో మౌనం వహించే పవన్.. ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరించాడు. పెళ్లికి రెడీ అవుతున్న రేణుకు విషెస్ చెప్పాడు.

తన సంతోషంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్న రేణుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు పవన్ ట్వీట్ చేశాడు. ఆమెకు సమృద్ధిగా ఆరోగ్యం.. సంతోషం.. శాంతి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూశాక అయినా అభిమానుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నారు. పవన్ మరో పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతున్నపుడు రేణుకు మాత్రం ఈ హక్కు ఉండదా? ఆమె మాత్రం ఎప్పటికీ పవన్ మాజీ భార్యగా.. ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలు వేసుకుంటే ఆమెను ఎవ్వరూ ఈ విషయంలో నిందించరు. ఆమె వ్యక్తిగత వ్యవహారాల్లోకి దూరిపోయి.. నిందలు వేయడం ఇప్పటికైనా అభిమానులు మానుకుంటే మంచిది. పవన్ ట్వీట్ తో అయినా వారిలో మార్పు వస్తుందేమో చూద్దాం మరి.