Begin typing your search above and press return to search.
ట్రెండీ టాపిక్: పవన్ వారసుల చెలిమి
By: Tupaki Desk | 28 Oct 2019 10:54 AM GMTటాలీవుడ్ లో ఈసారి దీపావళి సందడి స్పెషల్ గానే కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా కాంపౌండ్ ఉత్సవాల గురించి అంతకంతకు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. సైరా సక్సెస్ నేపథ్యంలో అంటూ మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ ద్వయం తమ కుటుంబంలోని అందరినీ ఓచోటికి చేర్చి అదిరిపోయే పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి నాగబాబు ఫ్యామిలీ సహా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
అంతేకాదు ఈ పార్టీలో పవర్ స్టార్ భార్య అన్నా లెజినోవా సహా పవన్ నలుగురు వారసులు కనిపించారు. రేణు వారసులు అఖీరా- ఆద్యలతో పాటు అన్నాలెజినోవా వారసులు పోలెనా- మార్క్ శంకర్ ఇద్దరూ సందడి చేశారు. ఇక కిడ్స్ మధ్య స్నేహబంధం అంతే గొప్పగా కుదిరిందని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. రేణు వారసులిరువురూ సవతి తల్లి అయినా అన్నా లెజినోవాతో ఎంతో అన్యోన్యంగా ఉండడం కంటపడింది. లెజినోవా కిడ్స్ అందరితో కలిసిపోయారు. పవన్ వారసులంతా లెహెంగా తరహా డ్రెస్ లలో ఒకే డ్రెస్ కోడ్ మెయింటెయిన్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మొత్తానికి చూడ ముచ్చటైన ఫ్రేమ్ ఈ పార్టీలో సరిగ్గా కుదిరింది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. పవన్ వారసుల చెలిమి గురించి ఈ పార్టీ లీక్ చేసిందిలా.
అఖీరా- ఆద్య ఇద్దరూ పూణేలో రేణు దేశాయ్ తో పాటుగా నివసించేవారు. కానీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సహా ఆ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా కలిసిపోవడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ ఇద్దరి భవితవ్యం కొణిదెల కాంపౌండ్ తో ముడిపడి ఉందని అర్థమవుతోంది. వారికి అండగా నిలిచేందుకు రామ్ చరణ్ అన్న సిద్ధంగా ఉన్నారు.