Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్‌కు కొత్త డైరక్టరా?
By: Tupaki Desk | 24 May 2015 3:30 PM GMTఈ మధ్య కాలంలో అసలు పవన్ కళ్యాణ్ కొత్త కొత్త దర్శకులతో పనిచేసిందే లేదు. కనీసం ఒక్క సినిమా అయినా తీసి ప్రూవ్ చేసుకుంటేనే పవన్ దగ్గర స్టోరీ వినిపించడానికి ఛాన్సు ఉంటుంది. కాని మనోడు ఇప్పుడు తన తదుపరి సినిమాను కొత్త డైరక్టర్‌తో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట దాసరి.
అసలు పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అంటూ షాకిచ్చిన దాసరి, ఈ సినిమా కోసం ఒక కొత్త దర్శకుడిని ఇంట్రోడ్యూస్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటివరకు మనకున్న స్టార్ డైరక్టర్లందరూ బిజీయే. పవన్‌తో సినిమా చేయడానికి వీరికి సమయం లేదు. ఇకపోతే అసలు పవన్‌ను డైరక్ట్ చేయాలని ఓ రెండు మూడు సినిమాలు చేసిన టాలెంటడ్ డైరక్ట్‌ర్సను దించితే, వారు సంపత్ నంది ఎపిసోడ్ చూసి కాస్త షాకవుతున్నారు. కెరియర్ కొత్తల్లో అంత టైమ్ వేస్టు చేసుకుంటే తరువాత కష్టమని ఫీలవుతున్నారు. లేకపోతే ఇంకెవరైనా సీజన్డ్ డైరక్టర్స్‌ను లైన్‌లోకి తేవాలి. అలా చేస్తే బిజినెస్ విషయంలో దెబ్బ పడుతుంది. అందుకే కొత్త డైరక్టర్ అయితే బెస్ట్ అని దాసరి ఎనాలిసిస్ చేసుకున్నారట.
కరక్టే కాని.. ఓ కొత్త డైరక్టర్ అనే సరికి అసలు పవన్ కళ్యాణ్‌ను హ్యాండిల్ చేయడమే ఓ పెద్ద విషయం అంటే, ఆయన అభిమానుల అవసరాలను అర్ధంచేసుకొని ఓ హరీశ్ శంకర్‌లా, త్రివిక్రమ్‌లా సినిమాను మలచడం ఇంకా పెద్ద విషయం. చూద్దాం ఏం చేస్తారో...