Begin typing your search above and press return to search.

రెండో దర్శనమిచ్చిన జూనియర్ పవర్ స్టార్ -2

By:  Tupaki Desk   |   22 Aug 2018 4:30 PM GMT
రెండో దర్శనమిచ్చిన జూనియర్ పవర్ స్టార్ -2
X
పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే సినిమాలకు దూరంగా రాజకీయాలతో బిజీగా ఉంటున్నాడు కానీ.. సీన్ కట్ చేసి పొలిటికల్ ఎంట్రీ కంటే ముందు ఉన్న రోజుల్లోకి వెళ్తే అదో డిఫరెంట్ సిట్యుయేషన్. పవన్ ఏం చేసినా న్యూసే అన్నట్టుగా ఉండేది. స్వతహాగా మీడియాతో ఎక్కువగా గడిపే వ్యక్తి కాక పోవడం.. పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా మాట్లాడకుండా ఉండడంతో పవన్ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండేది.

కానీ.. ఈమధ్య రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తుండడంతో అలాంటి ఆసక్తి కొంత తగ్గిన మాట వాస్తవమే. కానీ ఎన్నిమారినా పవర్ స్టార్ పవర్ స్టారే కదా. పవన్ తన ఫ్యామిలీతో కలిసి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం పెద్ద న్యూస్ అయింది. పవన్ వైఫ్ అన్నా లెజ్నేవా - కూతురు పోలెనా - చిన్న కొడుకు మార్క్ శంకర్ తో కలిసి చిరు తో ఫోటో కు పోజివ్వడం.. ఆ ఫోటో వైరల్ కావడం తర్వాత జరిగిన విషయాలు.

ఇందులో పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. పవన్ కొడుకు పుట్టిన సమయంలో మీడియాలో వచ్చిన ఒకే ఒక ఫోటో తప్ప ఇంతవరకూ వేరే ఫోటో బయటకు రాలేదు. ఇది మీడియాలో బయటకు వచ్చిన సెకండ్ పిక్ కావడంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పైగా ఈ ఫోటోలో నాన్నతో పాటుగా పెదనాన్న కూడా ఉండడం.. అదీ పెదనాన్న బర్త్ డే రోజు కావడంతో మెగా ఫ్యాన్స్ కు ఒక మెమొరబుల్ పిక్ లా మారిపోయింది. అకీరానందన్ జూనియర్ పవర్ స్టార్ అయితే.. మార్క్ శంకర్ జూనియర్ పవర్ స్టార్ - 2 అని కూడా కొంత మంది అభిమానులు కామెంట్ చేయడం విశేషం.