Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌, రేణు... స‌చిన్ తో ఒక డిన్న‌ర్‌!

By:  Tupaki Desk   |   30 Aug 2016 7:25 AM GMT
ప‌వ‌న్‌, రేణు... స‌చిన్ తో ఒక డిన్న‌ర్‌!
X
జ్ఞాప‌కాలు ఎప్పుడూ తియ్య‌గానే ఉంటాయి. అందుకే, వాటిని నెమ‌రు వేసుకున్న‌ప్పుడ‌ల్లా మ‌రోసారి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం! గ‌తంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు త‌ల్చుకున్న ప్ర‌తీసారీ ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. అయితే, ఒక సంఘ‌ట‌న అలాంటి జ్ఞాప‌కంగా మారాలంటే అది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌దిగా ఉండాలి క‌దా. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ను క‌లుసుకోవ‌డం ఎవ‌రికైనా తీపి జ్ఞాప‌క‌మే. ఆయ‌న‌తో ఫొటో దిగ‌డం బోన‌స్ ఆనందం. ఆయ‌న‌తో క‌లిసి భోజ‌నం చేయ‌డం... అద్భుతం! అలాంటి క్ష‌ణాలను ఎవ‌రు మాత్రం మ‌ర‌చిపోగ‌ల‌రు చెప్పండి. స‌రిగ్గా, ఇలాంటి ఒక జ్ఞాప‌కాన్నే త‌న గ‌తం నుంచి వెలికి తీసి అభిమానుల‌తో పంచుకుంటున్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌.

ఎప్పుడో, 2003లో చోటు చేసుకున్న సంఘ‌ట‌న ఇది. భార‌త క్రికెట్ జ‌ట్టు అంతా ఒక కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. అదే ఫంక్ష‌న్ కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ - అప్ప‌టి భార్య రేణు దేశాయ్ క‌లిసి వెళ్లారు. అక్క‌డే స‌చిన్ టెండూల్క‌ర్ ను క‌లుసుకున్నారు. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ - రేణు - స‌చిన్ లు ఒక ఫొటో దిగారు. ముగ్గురూ క‌ల‌సి అదే ఫంక్ష‌న్ లో డిన్న‌ర్ కూడా చేశారు. కాసేపు ముచ్చ‌టించుకున్నారు. ఆనాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ అదే ఫొటోని ఇప్పుడు త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు రేణు దేశాయ్‌. నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నా, మీరూ చూడండి అంటూ ఈ ఫొటో షేర్ చేశారు. మాజీ హబ్బీతో మ‌ర‌పురాని జ్ఞాప‌కాల్లో ఇదీ ఒక‌టి అయి ఉంటుంది.