Begin typing your search above and press return to search.

మార్చ్ 3న 'వకీల్ సాబ్' నుండి పవన్ మార్క్ సాంగ్..!

By:  Tupaki Desk   |   2 March 2021 12:30 PM GMT
మార్చ్ 3న వకీల్ సాబ్ నుండి పవన్ మార్క్ సాంగ్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుధీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి గతేడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా బ్రేక్ వలన ఇంతకాలం వాయిదా పడింది. మొత్తానికి ఈ ఏడాది వేసవి కానుకగా వకీల్ సాబ్ ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్లతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్. ఇంతకాలం రాజకీయంలో సమస్యలను ప్రస్తావించే పవన్ కళ్యాణ్.. ఈ మూవీలో సమస్యలపై వాదించే లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే తన సినిమాలలో ఏదొక సందేశాత్మక సాంగ్ పెట్టాలని ట్రై చేస్తుంటాడు పవన్. ఆ విధంగానే ఖుషి, జానీ, జల్సా, గుడుంబా శంకర్, బాలు లాంటి సినిమాలలో సాంగ్స్ మెయింటైన్ చేసాడు.

అయితే ఈసారి వకీల్ సాబ్ మూవీలో కూడా సత్యమేవజయతే అనే సందేశాత్మక పాట ఉన్నట్లు తెలుస్తుంది. ఆ పాట కూడా మార్చ్ 3న సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ సాంగ్ గురించి లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో సాంగ్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పాలి. అయితే దాదాపు ఫస్ట్ సింగిల్ 'మగువ మగువ' విడుదలైన సంవత్సరానికి రెండో సింగిల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గతేడాది మార్చ్ 8న ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. సరిగ్గా ఏడాది గ్యాప్ తర్వాత మార్చ్ నెలలో సత్యమేవజయతే విడుదల చేస్తున్నారు. అయితే వకీల్ సాబ్ మూవీ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. శృతిహాసన్ పవన్ భార్యగా కనిపించనుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.