Begin typing your search above and press return to search.
అలా పద్దతి కాదు.. పవన్ రానా మూవీ టైటిల్ ఇంట్రెస్టింగ్ చర్చ
By: Tupaki Desk | 28 July 2021 5:30 AM GMTపవన్ కళ్యాణ్... రానాలు కలిసి నటిస్తున్న మలయాళం అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ మేకింగ్ వీడియోను నిన్న విడుదల చేసిన విషయం తెల్సిందే. మేకింగ్ వీడియో లో సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపించడంతో పాటు సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో చిత్రీకరణ జరుపుతున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమా లో కాస్త అటు ఇటుగా రానాకు కూడా సమానమైన పాత్ర ఉంటుందట. ఒరిజినల్ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా లో ఇద్దరు హీరోలకు కూడా చాలా కీలకమైన పాత్రలే దక్కాయి.
తెలుగు లో పవన్ ఇమేజ్ కాస్త ఎక్కువ కనుక స్క్రీన్ ప్లే పరంగా స్క్రీన్ ప్రజెన్స్ పరంగా ఆయనకు కాస్త ఎక్కువ స్కోప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా రానా పాత్ర పరిధి మాత్రం తగ్గించక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పవన్ మరియు రానాలు ఖచ్చితంగా సినిమా లో హోరా హోరీగా నటించడం ఖాయంగా అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో టైటిల్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అంటూ అనౌన్స్ చేశారు. అప్పటి నుండి కూడా ఈ సినిమా టైటిల్ ను భీమ్లానాయక్ గానే అంతా చర్చిస్తున్నారు.
భీమ్లా నాయక్ గా సినిమాను విడుదల చేయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. టైటిల్ విభిన్నంగా క్యాచీగా అందరిని ఆకట్టుకునేలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి భీమ్లా నాయక్ సినిమా టైటిల్ అంటూ బలంగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో మరో వైపు దగ్గుబాటి అభిమానులు మాత్రం కొందరు ఈ విషయమై అభ్యంతరంను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా లో రానా కూడా ఉన్న సమయంలో ఆయన పాత్ర పేరుతో సినిమా టైటిల్ ను ఎలా ఖరారు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
గతంలో వెంకటేష్ తో పవన్ కళ్యాణ్ నటించిన సమయంలో ఇద్దరు పాత్రలకు సంతృప్తి దాయకంగా ఉండేలా గోపాల గోపాల అనే టైటిల్ ను పెట్టారు. ఆ సమయంలో ఎలాంటి వివాదం తలెత్తలేదు. కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర పేరుతోనే సినిమా టైటిల్ ను పెడితే మాత్రం రానా అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక చిత్ర యూనిట్ సభ్యులు భీమ్లా నాయక్ ను కాకుండా మరేదైనా టైటిల్ ను ఆలోచించే అవకాశం ఉందంటున్నారు.
పవన్ పాత్ర పేరు ప్రకటించారు కాని టైటిల్ ను ప్రకటించలేదు. కాని పవన్ అభిమానులు మాత్రం అదే సినిమా టైటిల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు అనుకోకున్నా ఇక ముందు అయినా అదే టైటిల్ ను సినిమాకు ఖరారు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం వారు చిత్ర యూనిట్ సభ్యులపై ఆ విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందుతోంది. కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఖచ్చితంగా భీమ్లా నాయక్ కాకుండా మరేదైనా టైటిల్ తో రావాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట.
ఇప్పటికే కొన్ని టైటిల్స్ వారి పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే ఒక టైటిల్ ను కన్ఫర్మ్ చేసి ఆ తర్వాత సినిమా అనౌన్స్ చేయబోతున్నారు. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉంది. అప్పుడు టైటిల్ తో పాటు టీజర్ ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.