Begin typing your search above and press return to search.
హిందీ డబ్బింగుల్లో అబ్బాయి - బాబాయ్ అరుదైన రికార్డులు
By: Tupaki Desk | 31 July 2021 4:02 AM GMTఇండస్ట్రీలో ఏదైనా పెద్ద సంచలనం నమోదైనప్పుడు ఫేజ్ మారుతుందని సూపర్ స్టార్ కృష్ణ ప్రతిసారీ తన వారసుడు మహేష్ కి చెబుతుండేవారు. బాహుబలి రిలీజై సంచలన విజయం సాధించాక మహేష్ ఓ వేదికపై అన్న మాట ఇది. టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో హిందీ మార్కెట్ ని కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది. మన సినిమాల రీమేక్ హక్కులు.. డబ్బింగులకు ఇరుగు పొరుగున విపరీతమైన గిరాకీ పెరిగింది.
హిందీ డబ్బింగుల్లో గత రికార్డుల్ని పరిశీలిస్తే... మహేష్ - పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన `మహర్షి` హిందీ డబ్బింగ్ హక్కులు 20 కోట్లకు వెళ్లాయంటే అర్థం చేసుకోవాలి. సూపర్ స్టార్ మహేష్ - అనీల్ రావిపూడి మూవీ సరిలేరు నీకెవ్వరు డబ్బింగ్ హక్కులు 15.2 కోట్లకు అమ్ముడయ్యాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` కోసం 19 కోట్లు చెల్లించగా... యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `అరవింద సమేత`కు హిందీ వాళ్లు 18 కోట్లకు అనువాద హక్కులు కొన్నారు. పలువురు అగ్ర హీరోలు నటించిన హిందీ సినిమాల డబ్బింగ్ రైట్స్ భారీ ధరలకు కొనుక్కుంటున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన డిజాస్టర్ చిత్రం `వినయ విధేయ రామ` హిందీ డబ్బింగ్ హక్కులు రూ. 22 కోట్లు పొందినట్లు సమాచారం. వినయ విధేయ రామ ఎంత డిజాస్టర్ అయినా హిందీలో ఆ రేంజుకు వెళ్లడం ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ టాలీవుడ్ బెస్ట్ ఇదేనన్న టాక్ కూడా వినిపించింది.
మళ్లీ ఆ రేంజును మించి హిందీ డబ్బింగ్ హక్కుల కోసం పవన్ - రానా మూవీకి ఏకంగా 23కోట్లు చెల్లిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ఇంత భారీ ధర పలికింది. ఈ డీల్ నిజంగా అనూహ్యమైనది అంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. పవన్ .. రానాలకు జాతీయ స్థాయిలో చక్కని ఫాలోయింగ్ ఉంది. అందువల్ల ఈ చిత్రం మరొక దక్షిణాది చిత్రానికి రీమేక్ అని కూడా చూడలేదు. ఇద్దరు క్రేజీ హీరోలతో భారీ మల్టీస్టారర్ కాబట్టి అంత డిమాండ్ పలికిందని సమాచారం. అయ్యారే ఫేం సాగర్.కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల కానుంది. సెప్టెంబర్ 2 న పవన్ కల్యాణ్ పుట్టినరోజున ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తారని అభిమానులు భావిస్తున్నారు. హిందీ డబ్బింగుల్లో అబ్బాయి - బాబాయ్ అరుదైన రికార్డుల గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన పవన్ మరో ఘనవిజయం అందుకుంటాడనే అభిమానులు భావిస్తున్నారు. హిందీ డబ్బింగుల్లో అబ్బాయి - బాబాయ్ అరుదైన రికార్డుల గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది.
మళ్లీ పవన్ కే ఆ ఛాన్స్?
మునుముందు హిందీ డబ్బింగ్ రైట్స్ పరంగా రికార్డులు బ్రేక్ చేయడానికి భారీ చిత్రాల క్యూ ఉంది. వీటిలో ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 వంటి చిత్రాలతో పాటు బన్ని నటిస్తున్న పుష్ప డ్యూయాలజీ.. పవన్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ `హరిహర వీరమల్లు` ఉన్నాయి. ఇకపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ హిందీ డీల్స్ పెద్ద స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.