Begin typing your search above and press return to search.

సావిత్రి ప‌డిపోతుందా? ప‌డిపోదా?

By:  Tupaki Desk   |   14 Sep 2015 7:30 AM GMT
సావిత్రి ప‌డిపోతుందా? ప‌డిపోదా?
X
యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ ఇష్క్ కాద‌ల్ యువ‌త‌రాన్ని మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా న‌చ్చ‌డం వ‌ల్లే నారా రోహిత్ సాధినేనికి పిలిచి ఛాన్సిచ్చాడు. ప్ర‌స్తుతం రోహిత్ హీరోగా ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఫేం నందిత టైటిల్ పాత్ర‌ని పోషిస్తోంది. నందిత క‌ళ్ల‌తోనే హావభావాలు ప‌లికించి బుట్ట‌లో వేసేస్తుందిట‌. అలాగే నారా రోహిత్ క్యారెక్ట‌ర్ మునుపెన్న‌డూ చూడ‌నంత కొత్త‌గా ఉంటుంద‌ని చెప్పాడు. అత‌డు ఈ చిత్రంలో కేస‌నోవాలా క‌నిపిస్తాడు. అత‌డంటే అమ్మాయిలంతా ఇట్టే ప‌డిపోతారు. అంత ఆక‌ర్ష‌ణ ఉన్న హీరోగా క‌నిపిస్తాడ‌ని ప‌వ‌న్ సాధినేని చెబుతున్నాడు. రోహిత్‌ ని ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ చూపించ‌ని కొత్త కోణంలో చూపిస్తున్నాన‌ని రివీల్ చేశాడు.

అయితే నారా రోహిత్‌ ని తెర‌పై చూపించే విధానం అత‌డి ఇమేజ్‌ ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాడా? అన్న సందేహాలొస్తున్నాయిక్క‌డ‌. రోహిత్ ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్ దృష్ట్యా అత‌డిని బాధ్య‌తారాహిత్యంగా చూపిస్తే దానిని రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు ప్ర‌ధాన అస్ర్తంగా ఉప‌యోగించుకునే ఛాన్సుంది. నారా వార‌బ్బాయ్ ... చిలిపికృష్ణుడు - అత‌డి సినిమాలు చూస్తే అది తెలిసిపోతుంది.. అంటూ ఎద్దేవా చేసే ఛాన్సుంది. అస‌లే దుష్ట రాజ‌కీయాలు. కాబ‌ట్టి ప‌వ‌న్ సాధినేని రోహిత్‌ ని చూపించే తీరు చాలా ప్రాక్టిక‌ల్‌ గా ఉండాలి. అలాగే రోహిత్ ఇప్ప‌టివ‌ర‌కూ న‌టించిన సినిమాల‌న్నీ బాధ్య‌తాయుత‌మైన‌వి. బాణం - సోలో - ప్ర‌తినిధి .. ఇవ‌న్నీ అత‌డికి మంచి పేరు తెచ్చాయి. ఆ బోర్డ‌ర్ క్రాస్ చేయ‌కుండా వెకిలి లేకుండా విజ‌యం సాధించే సినిమా కావాలిప్పుడు. కాబ‌ట్టి ప‌వ‌న్ సాధినేని రోహిత్‌ ని క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌ లో ఎలా ఆవిష్క‌రించ‌బోతున్నాడు అన్న డిష్క‌స‌న్ సాగుతోంది. అస‌లింత‌కీ కేస‌నోవా అంటూ ప్ర‌చారం చేస్తున్నారు కాబ‌ట్టి సావిత్రి అత‌డికి ప‌డిపోతుందా? ప‌డిపోయినా అందులోనూ డిగ్నిటీ చూపించాల్సిదే గురూ!