Begin typing your search above and press return to search.
నాలుగు టికెట్లు తెగుతాయనే ‘సావిత్రి’
By: Tupaki Desk | 25 Feb 2016 7:30 AM GMTప్రేమ ఇష్క్ కాదల్.. మూడేళ్ల కిందట విడుదలైన ఈ సినిమాకు మంచి పేరైతే వచ్చింది కానీ.. సినిమా నిలబడలేదు. పేరున్న నటీనటులు లేకపోవడమో.. సరిగా ప్రమోట్ చేయకపోవడమో.. కారణమేదైనా కానీ కంటెంట్ ఉన్నప్పటికీ సినిమా జనాలకు చేరువ కాలేదు. ఐతే సినిమా ఆడకపోయినా.. దర్శకుడు పవన్ సాధినేనికి ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగపడింది. నారా రోహిత్ లాంటి టాలెంటెడ్ హీరో అతడికి పిలిచి అవకాశమిచ్చాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘సావిత్రి’ అనే ఆసక్తికర సినిమా మొదలైంది. టైటిల్ తోనే ఆసక్తి రేపిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో మరింత ఆకట్టుకుంది. టీజర్ కూడా ఆసక్తిని పెంచింది.
తాజాగా రోహిత్ స్వయంగా పాడిన పాటను లాంచ్ చేస్తూ సినిమా విశేషాల్ని పంచుకుంది చిత్రబృందం. ఈ సందర్భంగా పవన్ సాధినేని మాట్లాడుతూ.. ‘సావిత్రి’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాడు. తన తొలి సినిమాకు భిన్నంగా ఫ్యామిలీ మూవీ ఎంచుకోవడానికి కారణం కూడా ఉందని చెప్పాడతను. ‘‘ప్రేమ ఇష్క్ కాదల్ తర్వాత అవకాశాల కోసం చాలామంది నిర్మాతల్ని కలిశాను. చివరికి రాజేంద్రప్రసాద్ గారు ఛాన్స్ ఇచ్చారు. కథ పూర్తిగా చెప్పకుండానే రోహిత్ హీరోగా ఇలాంటి సినిమా చేద్దామనుకుంటున్నాను అనగానే ఓకే చెప్పేశారు. యూత్ సినిమా అయితే ఒక టికెట్టే తెగుతుందని.. ఫ్యామిలీ సినిమా అయితే నాలుగు టికెట్లు తెగుతాయనే ‘సావిత్రి’ లాంటి సినిమాను ఎంచుకున్నాను. ఇక రోహిత్ నా బ్రదర్ లాంటి వాడు. ఆయన ఈ సినిమా కోసం ఎంత చేశాడో ఆడియో ఫంక్షన్లో చెబుతా. సావిత్రి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చెప్పాడు పవన్.