Begin typing your search above and press return to search.
విద్యాబాలన్ సినిమాకి పవన్ టైటిల్
By: Tupaki Desk | 14 Aug 2021 2:30 PM GMTప్రయోగాలు చేయడంలో బాలన్ తర్వాతే. ఇప్పుడు మరో లేడీఓరియెంటెడ్ చిత్రంతో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా టైటిల్ ఇప్పుడు పవన్ అభిమానుల్లో చర్చకు వచ్చింది. దానికి కారణం జల్సా టైటిల్ ఎంపిక.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బ్లాక్ బస్టర్లలో `జల్సా ` ఒకటి. పవన్ ని నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రమిది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వెండితెరపై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పటికీ బుల్లి తెర టీఆర్పీల్లో జల్సా ఓ సంచలనమే. తాజాగా ఇదే టైటిల్ తో బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ తదుపరి ప్రాజెక్ట్ కోసం జల్సా టైటిల్ ఫిక్స్ చేసారు.
ఈ కొత్త చిత్రం టైటిల్ ని `జల్సా హోగా` అని విద్యా బాలన్ నిన్న రాత్రి ప్రకటించారు. సురేష్ త్రివేణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. చిత్రీకరణ కూడా ప్రారంభమైందని విద్యాబాలన్ తెలిపారు. అన్నిపనులు పూర్తి చేసి మేకర్స్ దీనిని 2022 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్- విక్రమ్ మల్హోత్రా- రోహిణి హట్టంగడి- ఇక్బాల్ ఖాన్- విధాత్రి బండి -గురుపాల్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ - అబుండంటియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బాలన్ తెలుగువారికి సుపరిచితమైన నటి. అంతకుముందు ఎన్బీకే నటించిన ఎన్టీఆర్ -కథానాయకుడు చిత్రంలో బసవతారకం పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక బాలన్ నటించిన డర్టీ పిక్చర్ ఎంతటి సంచలన విజయమో తెలిసిందే. తెలుగమ్మాయి .. ఐటమ్ గాళ్ సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
ఇటీవల బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్లతో ఆకట్టుకుంటున్న బాలన్ ఇప్పుడు మరో ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కునన్న జల్సా హోగాలో నటించనున్నారు.