Begin typing your search above and press return to search.

సైరాకు పవర్ స్టార్ సపోర్ట్ ?

By:  Tupaki Desk   |   14 Aug 2019 7:02 AM GMT
సైరాకు పవర్ స్టార్ సపోర్ట్ ?
X
ఇవాళ మధ్యాన్నం 3 .45 నిమిషాలకు విడుదల కాబోతున్న సైరా మేకింగ్ వీడియో కోసం మెగా ఫ్యాన్స్ గంటలు నిముషాలు వంతున కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. ఇది ఎంత నిడివితో ఉంటుంది ఎవరెవరు కనిపిస్తారు అనేదాని మీద సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లీకైన ఒక తాజా అప్ డేట్ అభిమనులకు మరింత జోష్ ఇచ్చేలా ఉంది.

దాని ప్రకారం సైరా టీజర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని వినికిడి. దీనికి సంబంధించిన డబ్బింగ్ ఇటీవలే చెప్పినట్టుగా టాక్. ఇది నిజమో కాదో నిర్ధారణ లేదు కాని ఓ డబ్బింగ్ స్టూడియోలో పవన్ చిరు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక్కడ చెప్పినట్టు అది సైరా టీజర్ కోసం చెప్పిన డబ్బింగ్ సందర్భమా లేక మరో కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఒకవేళ నిజమైతే ఇప్పటికే ఓ రేంజ్ లో ఉన్న సైరా హైప్ కు పవన్ గొంతు పెద్ద బోనస్ అవుతుంది. అసలే తమ హీరో సినిమాలు చేయడం లేదని ఫీలవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది మరింత జోష్ ఇస్తుంది. అందులోనూ అన్నయ్య సినిమాకు అంటే అంతకన్నా కావలసింది ఏముంది. మేకింగ్ వీడియోలో కొన్ని కీలకమైన విజువల్స్ చూపబోతున్నట్టు తెలిసింది. ఇప్పుడీ పవన్ వాయిస్ న్యూస్ నిజమా కదా అని తేలాలంటే ఈ నెల 20 వరకు ఆగాలి.