Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్ 2 : ప‌వ‌న్‌ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ప్ర‌భాస్‌!

By:  Tupaki Desk   |   28 Dec 2022 7:46 AM GMT
అన్ స్టాప‌బుల్ 2 : ప‌వ‌న్‌ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ప్ర‌భాస్‌!
X
నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కోసం హోస్ట్ గా స‌రికొత్త‌ అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. బాల‌య్య హోస్ట్ గా అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికే' పేరుతో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఎపిసోడ్ తో మొద‌లే పెట్టిన సీజ‌న్ 1 మ‌హేష్ బాబు ఎపిసోడ్ తో ఎండ్ కావ‌డం.. టాక్ షోల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ షోగా పాపుల‌ర్ కాడం తెలిసిందే. అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2ని మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ ల‌తో స్టార్ట్ చేయ‌డం.. ఇది కూడా ఓ రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే.

సీజ‌న్ 1 ని మించి సీజ‌న్ 2 ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. సీజ‌న్ 1 ని మించి సీజ‌న్ 2 లో క్రేజీ స్టార్ల‌తో బాల‌య్య చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ టాక్ షో బాల‌య్య పై వున్న అపోహ‌లన్నింటిని తొల‌గించింది. బాల‌య్య అంటే సీరియ‌స్ గా వుంటార‌ని, స‌ర‌ద‌గా మాట్లాడ‌టం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు ఇండ‌స్ట్రీలో వినిపించేవి. అయితే ఎప్పుడైతే అన్ స్టాప‌బుల్ టాక్ షోలో బాల‌య్య ఈ షోలో పాల్గొనే వారితో స‌ర‌దాగా మాట్లాడుతూ పంచ్ వేస్తూ న‌వ్వులు పూయిస్తున్న తీరుకు అంతా అవాక్క‌వుతూ ఎంజాయ్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

దీంతో ఈ టాక్ షో ఇండియాలో వ‌న్ ఆఫ్ ది మోస్ట్ పాపుల‌ర్ టాక్ షోగా పేరు తెచ్చుకుంది. ప్ర‌ఖ్యాత ఐఎండీబీ రేటింగ్స్ లో ఈ షో టాప్ లో ట్రెండ్ కావ‌డం విశేషం. ఇదిలా వుంటే ఈ టాక్ షోలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొంటున్న విష‌యం తెలిసిందే.

గ‌త కొన్ని రోజులుగా ప‌వ‌న్ ఎప్పుడెప్పుడు ఈ టాక్‌ షోలో పాల్గొంటాడా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఫైన‌ల్ గా ఆ రోజు రానే వ‌చ్చేసింది. ఇటీవ‌లే ప‌వ‌న్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ మంగ‌ళ‌వారం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో మొద‌లైంది.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంతో పాటు రాజ‌కీయ, సినీ లైఫ్ పై ఈ షోలో బాల‌య్య ప్ర‌శ్న‌లు వేయ‌నున్నాడ‌ని చెబుతున్నారు. ఈ ప్ర‌త్యేక ఎపిసోడ్ సంక్రాంతికి స్ట్రీమింగ్ కానుందా? లేక అంత‌కు ముందే స్ట్రీమింగ్ అవుతుందా? అన్నది తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో బాల‌య్య ప్ర‌త్యేక ఎపిసోడ్ ని పూర్తి చేయ‌డం, ఇందులో గోపీచంద్ కూడా పాల్గొన‌డం తెలిసిందే. ప్ర‌భాస్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో ఇప్ప‌టికే విడుద‌లై నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఫుల్ ఎపిసోడ్ ని డిసెంబ‌ర్ 30న స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు. అయితే ప్ర‌భాస్ , ప‌వ‌న్ ల ఎపిసోడ్ ల‌లో ఏది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి పై ఏయి సాధిస్తుందా? అనే చ‌ర్చ ప్ర‌స్తుతం మొద‌లైంది. ప్ర‌భాస్ సినిమా, వ్య‌క్త‌గ‌త లైఫ్ కి సంబంధించిన ప్ర‌శ్న‌లే వుంటాయని, అదే ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూలో మాత్రం అత‌నంగా పొలిటిక‌ల్ హాట్ ని పెంచే ప్ర‌శ్న‌లు వుంటాయి కాబ‌ట్టి ప్ర‌భాస్ ఎపిసోడ్ ని మించి ప‌వ‌న్ ఎపిసోడ్ పైచేయి సాధించి నెట్టింట వైర‌ల్ కావ‌డం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.