Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ విమర్శల కు ఇలా చెక్ పెట్టారా?
By: Tupaki Desk | 1 Jan 2020 9:48 AM GMTసోషల్ మీడియాలో రేణు దేశాయ్ వ్యాఖ్యలు అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ గురించి.. తన రెండో పెళ్లి గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. అవన్నీ ముగిసిన కథ అనుకుంటే ఇటీవలే మరోసారి ఊహించని కామెంట్ తో ఫ్యాన్స్ లో అగ్గి రాజేశారు రేణు. ``పిల్లల్లో తల్లి రక్తమే ప్రసరిస్తుంది.. తండ్రి రక్తం కాదు!`` అంటూ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ఆ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రేణుదేశాయ్ పై వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు.
అయితే ఆ తర్వాత పవన్ అభిమానుల్ని కూల్ చేసేందుకు రేణు విశ్వప్రయత్నం చేస్తోంది. తాజాగా పవన్ తో కూతురు ఆద్య ఫోటోని రేణు ఇన్ స్టాలో రివీల్ చేసారు. ఇంతకు ముందు ఎప్పుడూ అభిమానులు చూడని ఫోటో ఇది. పవన్ తనకు.. తన పిల్లలకు ఎంత క్లోజ్ గా ఉంటారో ఈ ఫోటోని బట్టి అర్థమవుతోంది. ఈ ఫోటో చూడగానే పవన్ అభిమానుల ముఖంలో చిరునవ్వు కనిపించడం ఖాయం.
రేణు ప్రస్తుతం స్వస్థలం పూణే లో నివాసం ఉంటున్నారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీ కాబట్టి తన షెడ్యూల్స్ ని మ్యానేజ్ చేసుకుంటూ పూణే వెళుతుంటారు. అక్కడ కొంత సమయం పిల్లలతో గడుపుతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తున్న నేపథ్యంలో పవన్ బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల క్రిస్మస్ వేళ పవన్ తన రష్యన్ వైఫ్ అన్నా లెజినోవా తో కలిసి రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ వేడుకల అనంతరం నేరుగా ఇక్కడ ల్యాండ్ అయ్యి.. అమరావతి రాజధాని షిఫ్ట్ వ్యవహారంపై దృష్టి సారించారు.