Begin typing your search above and press return to search.

స్టార్ హీరో ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారా?

By:  Tupaki Desk   |   30 July 2022 10:30 AM GMT
స్టార్ హీరో ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారా?
X
సిటీ చుట్టుప‌క్క‌ల వున్న గ్రామాల్లో స్టార్ హీరోల‌కు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు, డైరెక్ట‌ర్ల‌కు ఫామ్ హౌస్ లు వున్న విష‌యం తెలిసిందే. ఒక్కొక్క‌రికి 10 నుంచి 16 ఏక‌రాల విస్తీర్ణంలో ఈ పామ్ హౌస్ లు వున్నాయి. ప్ర‌భాస్ తో పాటు మ‌రి కొంత మంది స్టార్ హీరోల‌కు కూడా ఫామ్ హౌస్ లున్నాయి.

అయితే తాజాగా సిటీ ఔట్ స్క‌ర్ట్స్ లో వున్న గండిపేట‌లో స్టార్ హీరో కొత్త‌గా ఫామ్ హౌస్ ని నిర్మించుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో ప‌క్క ఏపీ రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వన్ క‌ల్యాణ్ గ‌త కొంంత కాలంగా ఇటు సినిమాలు చేస్తూనే క్రియాశీల రాజ‌కీయాల్లొ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇటీవ‌ల హైద‌రాబాద్ లో వుంటూ ఏపీలో రాజ‌కీయం చేయ‌డం కాదు.. ఏపీలో వుండాల‌ని, ఏపీలో సొంత ఇల్లు కూడా లేని వారు ఇక్క‌డికి వ‌చ్చి మాట్లాడుతున్నార‌ని ఇటీవ‌ల వైసీపీ వ‌ర్గాలు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేశాయి.

ఈ విమ‌ర్శ‌ల‌కు థీటుగా స‌మాధానం చెప్పాల‌ని ఏపీ గుంటూరులోని కాజాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత ఇంటిని నిర్మిస్తున్నారంటూ ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ఆ త‌రువాత ప‌వ‌న్ కొత్త నివాసానికి సంబంధించి ఎలాంటి వార్త‌లు బ‌య‌టికి రాలేదు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా వినిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ లో వుంది. జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం ప్ర‌శాసన్ న‌గ‌ర్ లో వున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ప‌వ‌న్ కొత్త‌గా హైద‌రాబాద్ శివారులోని గండిపేట - చిలుకూరు మ‌ధ్య వున్న 16 ఏక‌రాల ఫామ్ లాండ్ లో కొత్త‌గా ఫామ్ హౌస్ ని నిర్మించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే అక్క‌డ ఓ ఫామ్ హౌస్ ని ప‌వ‌న్ నిర్మించారు. తాజాగా దాన్ని కూల్చేసి కొత్త‌గా స‌క‌ల సౌక‌ర్యాల‌తో మ‌రో ఫామ్ హౌస్ ని నిర్మిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డున్న ఫామ్ లాండ్ ఒక్కో ఎక‌రం 10 కోట్ల వ‌ర‌కు వుంటుంద‌ని చెబుతున్నారు. అంటే 16 ఎక‌రాల విలువ మొత్తం 160 కోట్లుగా చెబుతున్నారు.

మ‌రి అలాంటి విలువైన చోట ఫామ్ హౌస్ అంటే కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సిందే. మ‌రి గండిపేట స‌మీపంలో ఫామ్ లాండ్ లో ప‌వ‌న్ కడుతున్న ఫామ్ హౌస్ ఖ‌ర్చు ఎంత అన్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే గ‌త కొంత కాలంగా షూటింగ్ లు లేని స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గండిపేట స‌మీపంలోని ఫామ్ హౌస్ కి వెళ్లి అక్క‌డ కాల‌క్షేపం చేస్తుంటార‌న్న‌ది తెలిసిందే.