Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ లాగే ఆద్య పుస్త‌కాల పురుగు ఇదిగో ప్రూఫ్‌

By:  Tupaki Desk   |   1 May 2022 8:30 AM GMT
ప‌వ‌న్ లాగే ఆద్య పుస్త‌కాల పురుగు ఇదిగో ప్రూఫ్‌
X
ఈరోజుల్లో క‌థ‌ల‌ పుస్త‌కాలు చ‌దివేవాళ్లు అరుదు. నేటిత‌రం క‌మ‌ర్షియ‌ల్ బ‌డుల్లో పాఠ్య‌పుస్త‌కాల బ‌రువు మోయ‌డానికే నానా తంటాలు ప‌డుతున్నారు. లైబ్ర‌రీకి వెళ్లి న‌వ‌ల‌లు లేదా కాల్ప‌నిక ర‌చ‌న‌లు లేదా క‌విత‌లు సాహిత్యం చ‌దివేంత స‌మ‌యాన్ని కానీ ఆస‌క్తిని కానీ క‌లిగి లేరు. దానికి మోయ‌లేని చ‌దువుల భారం ఒక కార‌ణ‌మైతే ఆధునిక స‌మాజం పోక‌డలో వైప‌రీత్యం అలా ఉంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ప్ర‌తిదీ స్మార్ట్ ఫోన్ లో చ‌దువుకునే రోజులొచ్చాక‌.. పుస్త‌కాలు కొని చ‌దివేవాళ్లు కూడా లేరు.

అదంతా స‌రే కానీ.. ఇదిగో ఇక్క‌డ ధీక్ష‌గా పుస్త‌కం చేత‌ప‌ట్టి చ‌దివేస్తున్న ఆ చిన్నారి ఎవ‌రో తెలుసు కదా? .. ఆద్య కొణిదెల‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - రేణు జంట గారాల‌ కుమార్తె. నిజానికి తండ్రి వార‌స‌త్వాన్ని అభిరుచిని పుణికి పుచ్చుకుని ఆద్య కూడా ఇలా పుస్త‌కాలు చ‌దువుతూ క‌నిపించింది.

అలా రోడ్ ప‌క్క‌న మొబైల్ బుక్ షాప్ క‌నిపించ‌గానే త‌మ కార్ ని ఆపి వెళ్లి మ‌రీ పుస్త‌కాలు కొనిపించింద‌ట ఆద్య‌. ఈ విష‌యాన్ని రేణు దేశాయ్ ఎంతో సంబ‌రంగా చెప్పుకొచ్చారు. ఓ రెండు పుస్తకాలు కొనుక్కున్నామ‌ని తెలిపారు. పుస్త‌కాలు ఎన్ని చ‌ద‌వ‌గ‌లిగితే అన్నీ చ‌దివేయండి అని కూడా నేటిత‌రానికి రేణు సూచించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఆన్ లొకేష‌న్ కాసేపు తీరిక స‌మ‌యం చిక్కితే పుస్త‌కాలు చ‌దివేందుకు ఎంతో ఆస‌క్తిగా ఉంటారు.

ఇంత‌కుముందు అలాంటి దృశ్యాలు వెబ్ లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. రేణు కి కూడా పుస్త‌క‌ప‌ఠ‌నంలో అభిరుచి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. వార‌సులకు ఈ అల‌వాటు అబ్బింద‌ని భావించాలి. ఆద్య కొణిదెల ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే త‌న స్ట‌డీస్ ని కొన‌సాగిస్తోంది. నేటి త‌రానికి ప్ర‌ధాన న‌గ‌రాల్లో శాఖా గ్రంధాల‌యాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ప్ర‌భుత్వాల స‌హ‌కారం మాత్రం నిల్ అన్న చ‌ర్చా నిరంత‌రం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రంధాల‌యాల అభివృద్ధికి సెల‌బ్రిటీల స‌హ‌కారం ఉంటే బావుంటుందేమో!