Begin typing your search above and press return to search.
పవర్ లేనివాడు పవర్ స్టార్ ఏంటి? .. తీసేయండయ్యా బాబూ: పవన్
By: Tupaki Desk | 26 Sep 2021 3:06 AM GMTసాయితేజ్ హీరోగా దర్శకుడు దేవ కట్టా 'రిపబ్లిక్' సినిమా చేశాడు. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం .. తన మేనల్లుడు సాయితేజ్ కోసం పవన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చారు. ఈ వేదికపై ఆయన ఈ సినిమాను గురించే కాకుండా, సినిమా ఇండస్ట్రీ సమస్యలను గురించి .. తేజు యాక్సిడెంట్ విషయాన్ని హైలైట్ చేయడాన్ని గురించి మాట్లాడారు.
"సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్ .. చాలా ఈజీ టార్గెట్. తేజు 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళుతూ బైక్ పై నుంచి కుందపడిపోయాడు. ఆటోను ఓవర్ టేక్ చేస్తూ పడిపోయాడు అంటూ కథనాలు అల్లారు. అలా పడిపోవడం మా వాడు చేసుకున్న దురదృష్టం .. వాడి కర్మ. వైఎస్ వివేకానంద రెడ్డిగారు ఎందుకు హత్యకు గురయ్యారు? దాని మీద మాట్లాడండి .. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. కోడి కత్తితో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒక నాయకుడిని పొడిచారు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనుక భారీ కుట్ర ఉందని అన్నారు .. అది ఏవైంది .. అది అడగండి .. తేజ్ యాక్సిడెంట్ గురించి కాదు.
లక్షలాది మంది గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అది వాళ్లకి దక్కడం లేదు .. ఎందుకు? అనే దానిపై మాట్లాడండి .. తేజు యాక్సిడెంట్ పై కాదు. ఆరేళ్ల బిడ్డ అమానుషంగా హత్యకి గురైతే, అది వదిలేసి తేజు మీదనా కథనం? పవన్ అలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే, అభిమానులంతా కూడా 'సీఎం .. సీఎం .. ' అంటూ అరిచిగోల చేయడం మొదలుపెట్టారు. అందుకు పవన్ స్పందిస్తూ .. "ఇందాక సుమ గారు గానీ .. మీరు గాని పవర్ స్టార్ .. పవర్ స్టార్ అంటూ అరిచారు. పవర్ లేనివాడికి పవర్ స్టార్ ఏంటి? తీయండయ్యా బాబూ" అంటూ తనపైన తనే జోక్ వేసుకున్నారు.
నేను ఇక్కడికి సీఎం అనిపించుకోవడం కోసం రాలేదు. భారతదేశపు 'రిపబ్లిక్' ఏ విలువలతో అయితే రాజ్యాంగం చేయబడిందో, ఏ మహానుభావులైతే దీని కోసం పోరాటం చేశారో .. వాళ్ల ఆశయం కోసం నా వంతు కృషిగా నేను పనిచేస్తున్నాను. అది ముఖ్యమంత్రిని ఇస్తుందా .. ఇవ్వదా అనేది నాకు అనవసరం. పోరాటం చేస్తున్నామా? లేదా? అనేదే నాకు ముఖ్యం" అంటూ ఆవేశంగా మాట్లాడారు. పవన్ అలా ఆవేశంతో మాట్లాడుతూ ఉంటే, అక్కడికి వచ్చిన అభిమానులు చప్పట్లతో ఆయన అభిప్రాయాలకు మద్దతును ప్రకటిస్తూ ఉండటంతో ప్రసంగమంతా సందడిగా సాగింది.