Begin typing your search above and press return to search.

ఒకే ప్రేమ్ లో ప‌వ‌న్-చ‌ర‌ణ్ చ‌ర్చ‌లు షురూ

By:  Tupaki Desk   |   24 April 2022 2:43 PM GMT
ఒకే ప్రేమ్ లో ప‌వ‌న్-చ‌ర‌ణ్ చ‌ర్చ‌లు షురూ
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ కి రంగం సిద్దం అవుతుందా? అబ్బాయి..బాబాయిని అభిమానులు ఒకే ప్రేమ్ లో చూడాటానికి రెడీ అవ్వాల్సిందేనా? క‌థా చ‌ర్చ‌లు సాగుతున్నాయా? అంటే అవున‌నే అంటున్నారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. అవును `ఆచార్య` ప్ర‌మోష‌న్ లో ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ స్వ‌యంగా రివీల్ చేసారు. ఆ వేంటో చ‌ర‌ణ్ మాట‌ల్లోనే తెలుసుకుందాం.

``మల్టీ స్టారర్‌కి సంబంధించి ఇప్పటికే కొన్ని అంశాలపై చర్చించాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారితో తప్పకుండా సినిమా చేస్తాను మరియు నిర్మిస్తాను. కానీ ఇప్పుడు నేను నా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. శంకర్ సినిమా పూర్తయ్యాక గౌతమ్ తిన్ననూరి సినిమా ప్రారంభిస్తాను` అని అన్నారు. చ‌ర‌ణ్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి బాబాయ్ తో సినిమా షురూ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇద్ద‌రి ఇమేజ్ కి త‌గ్గ క‌థ‌..ద‌ర్శ‌కుడు కుదిరితే ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు.

ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాలు చేస్త బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అప్పుడ‌ప్పుడు రాజ‌కీయాల గురించి మాట్లాడినా..ఎక్కువ స‌మ‌యం సినిమాల‌కే కేటాయిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ లైన‌ప్ చూస్తే ఎంత బిజీగా ఉన్నారో అర్ధ‌మ‌వుతోంది. ఇదే మూవ్ మెంట్ లో ఇద్ద‌రికీ న‌చ్చే క‌థ దొరికితే ప‌ట్టాలెక్క‌డం ఎంత సేపు? అంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు.

అలాగే చ‌ర‌ణ్ మాట‌ల‌తో గౌత‌మ్ ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ వ‌చ్చింది. `జెర్సీ` ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో గౌత‌మ్ ప్రాజెక్ట్ ఉంటుందా? ఉండ‌దా? అని కొద్ది రోజులుగా డైల‌మా కొన‌సాగుతోంది. ఇటీవ‌లే హిందీ `జెర్సీ` కి అంత మంచి ఫీడ్ బ్యాక్ రాలేదు. దీంతో చ‌ర‌ణ్ వెన‌క్కి త‌గ్గుతున్నారని ప్ర‌చాసం సాంగింది. తాజాగా చ‌ర‌ణ్ వ్యాఖ్య‌ల‌తో గౌత‌మ్ ప్రాజెక్ట్ షురూ అయిన‌ట్లు తెలుస్తోంది.

అలాగే ఈ చిత్రాన్ని శంక‌ర్ తో చేస్తోన్న సినిమా పూర్త‌యిన వెంట‌నే మొద‌లు పెడ‌తామ‌ని చ‌ర‌ణ్ తెల‌ప‌డం విశేషం. ప్ర‌స్తుతం తాను శంక‌ర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాన‌ని..ఆ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ ఇంకే సినిమా గురించి ఆలోచించే ఛాన్స్ లేద‌ని తెలిపారు. మొత్తానికి చ‌ర‌ణ్ లైన‌ప్ పై ఓ క్లారిటీ వ‌చ్చింది. ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` తో పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించిన సంగ‌తి తెలిసిందే.