Begin typing your search above and press return to search.
ప్రివ్యూ వీక్షించిన భీమ్లా ఫుల్ జోష్ లో!
By: Tupaki Desk | 2 Feb 2022 5:44 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంపికలు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి. కాన్సెప్ట్ కంటెంట్ లేనిదే అతడు దర్శకుల ప్రపోజల్స్ కి అంగీకరించడం లేదు. ముఖ్యంగా తెలుగు స్ట్రెయిట్ సినిమాల కంటే రీమేక్ లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంతకుముందు గోపాల గోపాల.. వకీల్ సాబ్ రీమేక్ చిత్రాలే. ఇవి నటుడిగా పవన్ కల్యాణ్ కి గొప్ప పేరును తీసుకొచ్చాయి.
ఇప్పుడు భీమ్లా నాయక్ కూడా అలాంటి ప్రయత్నమే. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ ని తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోవిడ్ వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ప్రస్తుతం నిర్మాతలు రెండు రిలీజ్ తేదీల్ని ప్రకటించగా.. ఫిబ్రవరిలో విడుదల ఖాయమేనని భావిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా ప్రివ్యూని ప్రసాద్ లాబ్స్ లో చిత్రబృందం తో పాటు పవన్ కల్యాణ్ వీక్షించారు. భీమ్లా నాయక్ ఔట్ పుట్ విషయంలో పవన్ ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారట. అంటే తన కెరీర్ లో మరో బిగ్ హిట్ కొడతానన్న ధీమా ఆయనకు కలిగింది. దీనిని బట్టి పంపిణీవర్గాలలోకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్లడం ఖాయం.
భీమ్లా నాయక్ కోసం ఇటు పవన్ కల్యాణ్ అభిమానులు అటు రానా అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఇందులో టైటిల్ పాత్రలో పవన్ నటించగా.. డేనియల్ శేఖర్ అనే పెద్దమనిషి పాత్రలో రానా నటిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్యా సాగిన ఈగో గొడవలేంటనేది తెరపై చూడాల్సిందే.
ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షకుడు కాగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్వయంగా మాటల్ని అందించడం పెద్ద ప్లస్ కానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. థమన్ సంగీతం అందించారు.