Begin typing your search above and press return to search.

దేవుడి మీద ఒట్టు నన్నెవ్వరు పడక గదిలోకి పిలవలేదు

By:  Tupaki Desk   |   16 Jun 2020 9:30 AM GMT
దేవుడి మీద ఒట్టు నన్నెవ్వరు పడక గదిలోకి పిలవలేదు
X
బాలీవుడ్‌ తో పోల్చితే సౌత్‌ లో కాస్టింగ్‌ కౌచ్‌ ఎక్కువగా ఉంటుందనే టాక్‌ ఉత్తరాదిన ఉంది. సౌత్‌ హీరోయిన్స్‌ అన్ని విషయాలకు ఓకే అంటేనే సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తారు. ప్రస్తుతం సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అంతా కూడా ఆ విధంగా ఛాన్స్‌ లు దక్కించుకున్న వారే అనేది కొందరి భావన. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మరణం నేపథ్యంలో నెపోటిజం.. ఫేవరెటిజంపై మళ్లీ చర్చ జరుగుతోంది. ఈ విషయంలో హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌ స్పందించింది.

సౌత్‌ హీరోయిన్స్‌ పట్ల చిన్న చూపు బాలీవుడ్‌ వారికి ఉంటుంది. చాలా సార్లు నన్ను బాలీవుడ్‌ వారు కించ పర్చినట్లుగా మాట్లాడారు. నాకు సౌత్‌ లో వచ్చిన ఆఫర్లు పడుకోవడం వల్లే వచ్చాయి అనేది వారి అభిప్రాయం. నేను తెలుగులో ప్రముఖులతో కలిసి పని చేశాను. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను నన్ను ఎవరు కూడా పడక గదిలోకి పిలవలేదు. నన్ను ఎవరు కూడా ఆఫర్ల కోసం అంటూ నన్ను వాడుకోలేదు.

సౌత్‌ సినిమా తనకు స్వర్గంతో సమానం. బాలీవుడ్‌ మాత్రం నరకం అంది. బాలీవుడ్‌ లో నటించాలనే మోజుతో సౌత్‌ సినిమాలను వదులుకోవడం ఎంత పెద్ద తప్పో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. సౌత్‌ లో హీరోయిన్స్‌ ను చాలా గౌరవిస్తారు.. అభిమానిస్తారు. కాని బాలీవుడ్‌ లో మాత్రం నీచంగా మాట్లాడతారు. సుశాంత్‌ ను బాలీవుడ్‌ ప్రముఖులు పట్టించుకోలేదు.. ఆయన్ను పలు సందర్బాల్లో కించ పర్చినట్లుగా మాట్లాడటం ఆయన్ను పక్కకు పెట్టడం చేశారు. అందుకే ఆయనకు ఈ పరిస్థితి అంటూ పాయల్‌ ఆవేదన వ్యక్తం చేసింది.