Begin typing your search above and press return to search.
నాది కరోనా కాదు.. మలేరియా! అంటూ హీరోయిన్ తంటాలు..
By: Tupaki Desk | 3 May 2020 4:50 AM GMTపదేళ్ల క్రితం ప్రయాణం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ పాయల్ ఘోష్. అతి కొద్దికాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 20ఏళ్లకే సినిమాల్లోకి వచ్చిన పాయల్ రీసెంట్ గా 'కోయి జానేనా' సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. అంతకుముందు తెలుగులో అడపా దడపా చిన్న చిన్న పాత్రలలో కనిపించినా పాయల్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగితే అంత చేసి ప్రచారం చేస్తారు. తాజాగా పాయల్ ఘోష్ కి కరోనా అంటగట్టడంతో లబోదిబోమంటుంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. దీంతో పాయల్ కు కరోనా వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా ఆ వార్తలపై స్పందిచిన పాయల్ మాట్లాడుతూ.. ‘‘గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో నేను బాధపడుతున్న మాట నిజమే. ముందుగా తలనొప్పి ప్రారంభమై ఆ తర్వాత జ్వరం వచ్చింది. ఇది కరోనా కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. అయితే నా కుటుంబసభ్యులు - సన్నిహితులు మాత్రం ఆందోళన చెందారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించగా.. మలేరియా జ్వరం అని వైద్యులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ త్వరలోనే నశించాలని కోరుకుంటున్నాను. ఇక అతి త్వరలోనే మనందరం మళ్లీ సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామనే నమ్మకం నాకుంది’’.. అంటూ విషయాన్నీ క్లారిటీగా చెప్పింది పాయల్.