Begin typing your search above and press return to search.
మీటూ ఆరోపణలు చేసిన పాయల్ పాత ట్వీట్ వైరల్
By: Tupaki Desk | 22 Sep 2020 4:15 AM GMTబాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్ కు కంగనాతో పాటు కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం ఆమె చెప్పేదాంట్లో నిజం లేదేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాప్సి.. వర్మ వంటి వారు ఇప్పటికే అనురాగ్ కశ్యప్ కు మద్దతుగా నిలిచారు. మరికొందరు కూడా దర్శకుడు అలాంటి వాడు కాడు అంటూ సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేస్తున్నారు. పాయల్ మరో సారి తన వ్యాఖ్యలను సరి చూసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమె 2018లో చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో పాయల్ చేసిన ఈ ట్వీట్ అప్పుడు చాలా మంది ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు అదే ట్వీట్ ఇరుకున పడేసింది.
ఇంతకు పాయల్ అప్పటి ట్వీట్ లో ఏముంది అంటే.. ఇక్కడ ఎవరు కూడా రేప్ అవ్వబడరు. వారు అవకాశం పొందేందుకు ప్రయత్నిస్తారు. ఒక వేళ అవతలి వారి నుండి సరైన ప్రవర్తన రాకుంటే.. ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడ నుండి మౌనంగా వెళ్లడం మంచిది. అంతే తప్ప ఆ విషయం ఎక్కువగా ప్రచారం చేసి డ్రామా క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ పేర్కొంది. అంటే మీటూ ఆరోపణలు చేసిన వారు డ్రామా క్రియేట్ చేస్తున్నారని.. బలవంతంగా ఎవరు కూడా రేప్ చేయరు అంటూ ఆ ట్వీట్ లో పేర్కొంది. అంతా ఇష్టప్రకారం జరుగుతుంది. తర్వాత డ్రామాలు చేస్తున్నారు అనే అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ను తాను చేశాను అనే విషయాన్ని మర్చి పోయిందో లేదంటే ఆమె ఉద్దేశ్యం మారిందో కాని ఇప్పుడు మీటూ ఆరోపణలు అనురాగ్ కశ్యప్ పై చేసింది. ఒక నెటిజన్ ఈ ట్వీట్ ను తాజాగా రీ ట్వీట్ చేసి అయ్యో పాయల్ ఈ ట్వీట్ ను డిలీట్ చేయడం మర్చి పోయి మీటూ ఆరోపణలు చేసిందంటూ ట్రోల్ చేశాడు. దీనికి పాయల్ సమాధానం ఏంటీ అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.