Begin typing your search above and press return to search.
అప్పుడు చీవాట్లు తిని ఇప్పుడు ఇడియట్స్ అంటుందా?
By: Tupaki Desk | 2 Dec 2020 2:30 AM GMTభారత్ రత్న సౌండింగ్ తో పురస్కారం అందుకుని ఆనక చీవాట్లు తిన్న ఓ నటి గురించి సర్వాత్రా చర్చ సాగుతోంది. ఇటీవల గత కొంతకాలంగా వివాదాలతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన పాయల్ ఘోష్ గురించే ఇదంతా. మొన్ననే ఈ అమ్మడు రాజకీయాల్లో ప్రవేశించి పార్టీ జెండా కప్పుకుంది. ఈలోగానే భారత్ రత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డు అందుకుంది. ఆ తరువాత నెటిజనులు తీవ్రంగా సూటి పోటి మాటలతో పాయల్ పై విరుచుకుపడ్డారు. అయితే ఆ విమర్శలకు కౌంటర్ గా పాయల్ ఘోష్ తాజాగా స్పందించారు.
నటి కం నాయకురాలు పాయల్ ఘోష్ తన ట్విట్టర్ లో భారత్ రత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డు చిత్రాలను షేర్ చేయడంతో.. అసలు ఏం చేసినందుకు ఆ అవార్డు గెలుచుకుందో స్పష్టంగా తెలియకపోవడంతో అంతా గందరగోళంలో పడ్డారు. అనంతరం కొందరు నెటిజనులు చీవాట్లకు దిగారు. ఆ విమర్శలను తిప్పికొడుతూ ఘోష్ సోమవారం ఇలా ట్వీట్ చేశారు.
నన్ను ట్రోల్ చేయడానికి ముందు ఇడియట్స్ (ట్రోల్స్) నా వికీపీడియాని తనిఖీ చేసి ఉండాల్సింది. నేను దక్షిణాదిన కొన్ని చక్కని పురాణ సంబంద సినిమాలు చేశాను. బాలీవుడ్ లోనూ సంబంధిత సినిమా చేశాను అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
నవంబర్ 26 న జరిగిన అవార్డుల వేడుకకు తాను హాజరు కాలేకపోయానని ఘోష్ వెల్లడించాడు. ఆమె నివాసానికి వచ్చిన ట్రోఫీ చిత్రాలను పంచుకున్నాడు. హార్డ్ వర్క్ చాలా దూరం తీసుకువెళుతుంది. యువత దానిని చేపట్టాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. ఇలాంటి క్షణాలు నన్ను నిజంగా అణగదొక్కాయి అని ఘోష్ వ్యాఖ్యానించడం ఆసక్తికరం. భారతీయ సినిమాకు చేసిన కృషికి ఇటీవల కథానాయిక ఘోష్ కి మహారాష్ట్ర గవర్నర్ భారత్ రత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డును ప్రదానం చేశారు.
ఇటీవల అనురాగ్ కశ్యప్ పై ఆరోపణల అనంతరం వివాదం చెలరేగింది. ఇంతలోనే పాయల్ ఘోష్ రామ్ దాస్ అథవాలే సారథ్యంలోని ఆర్.పి.ఐలో చేరారున. దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ తనని వేధించాడని ఆరోపించిన పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) లో చేరి పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటు మరికొందరు పార్టీ చీఫ్.. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సమక్షంలో పార్టీలో చేరారు.
ఘోష్ మాట్లాడుతూ.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ బోధనలే తాను ఆర్.పి.ఐలో చేరడానికి ప్రేరేపించిందని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ బోధనల వల్ల నేను ప్రభావితమయ్యాను ఎందుకంటే విద్య డిగ్రీల గురించి కాదు.. జీవితం పట్ల మీ దృక్పథం గురించి. ఇది స్వతంత్ర ఆలోచనతో ఎదగడం నేర్పుతుంది. అని పాయల్ అన్నారు.
పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షునిగా ఘోష్ నియమితులయ్యారు. పార్టీలోకి ఘోష్ ఇతరులు ప్రవేశించడం మరింత బలపడుతుందని అథవాలే అన్నారు.