Begin typing your search above and press return to search.
#మీటూ.. ఆరోపించే ముందు ఆలోచించక బుక్కైందా?
By: Tupaki Desk | 23 Sep 2020 6:16 AM GMTదర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అవకాశం ఇస్తానని తనని లైంగికంగా వేధించాడని ఆరోపించింది. అలా తను అంగీకరించలేదు కాబట్టే తనకు అవకాశాలు ఇవ్వలేదని వెల్లడించింది. దీంతో ఆమె కొత్త వివాదానికి తెరతీసినట్టయింది. అనురాగ్ కశ్యప్ అవకాశం ఇచ్చిన హీరోయిన్ లలో ప్రధానంగా ముందు వరుసలో వున్న హీరోయిన్ లు రీచా చద్దా.. హుమా ఖురేషీ లు తమపై నిందల్ని ఖండించారు.
తాజాగా ఈ ఇద్దరిలో రీచా చద్దా .. పాయల్ ఘోష్ పై కౌంటర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో తన పేరుని పాయల్ ఎలా లాగుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పాయల్ పై లీగల్ యుద్ధానికి సిద్ధమైంది. ఇప్పటికే పాయల్ కు ఈ వివాదంపై లీగల్ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఇదే తరహాలో హుమా ఖురేషి కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆమె పేరును అనవసరంగా ఈ వివాదంలోకి లాగడం పట్ల ఆమె అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ఎన్నో అవాంతరాల్ని అధిగమించి ఎన్నో ఏళ్లు శ్రమించి ఈ స్థాయికి చేరుకున్న వారి మనో భావాలతో పాటు వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని మండిపడింది. తాప్సీ కూడా ఈ వివాదం గురించి స్పందించి సంఘీభావాన్ని ప్రకటించింది. దీంతో క్రమ క్రమంగా అనురాగ్ పై ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్ కార్నర్ అయిపోతోంది.