Begin typing your search above and press return to search.

అంతగా తిట్టేసి.. అంతలా పొగిడేయటమా పాయల్?

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:30 AM GMT
అంతగా తిట్టేసి.. అంతలా పొగిడేయటమా పాయల్?
X
కోపం వచ్చినప్పుడు తిట్టేయటం.. తాను కోరుకున్నది లభించినంతనే కూల్ అయి.. పొగిడేయటం చాలామంది చేస్తుంటారు. సినీనటి.. ఆర్ఎక్స్ మూవీతో మంచి బ్రేక్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ సైతం ఇదే రీతిలో రియాక్టు అయ్యారు.

తాజాగా ఆమె తాను ప్రయాణించిన ఇండిగో ఎయిర్ లైన్స్ మీద విరుచుకుపడ్డారు. తన లగేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేశారన్నారు. ఇండిగో సిబ్బంది తన లగేజ్ ను నిర్లక్ష్యంగా విసిరిపారేశారని.. దాంతో డ్యామేజ్ అయ్యిందని పేర్కొంటూ డ్యామేజ్ అయిన లగేజ్ ఫోటోల్ని షేర్ చేశారు.

సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. డ్యామేజ్ అయిన తన బ్యాగుల్ని చూపిస్తూ.. 'డ్యామేజ్ అయిన బ్యాగులు చూడండి. ఇండిగో విమాన సిబ్బందే కారణం. నా లగేజ్ ను ఇష్టానుసారం విసిరేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా నా లగేజ్ దారుణంగా పాడైంది. ఈ ప్రయాణం నాకు చేదు అనుభవాన్ని ఇచ్చింది' అని పోస్టు పెట్టారు.

కాసేపటికి ఆమె ఇండిగో ఎయిర్ లైన్స్ ను ప్రశంసలతో ముంచెత్తారు. తన అభ్యర్థనపై ఇండిగో స్పందించిందని.. తన సమస్యను పరిష్కరించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇండిగో సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ పాయల్ మరో పోస్టు పెట్టారు.

ఏమైనా.. తన పోస్టుతో ఫైర్ అవుతూ.. ఇండిగో ఎయిర్ లైన్స్ ను స్పందించేలా చేసి తన సమస్యను పాయల్ పరిష్కరించుకున్నారని చెప్పక తప్పదు. ఏమైనా.. అప్పటివరకు తిట్టేసి.. ఆ వెంటనే హర్షం వ్యక్తం చేసిన పాయల్ పోస్టు అందరిని ఆకర్షిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.