Begin typing your search above and press return to search.
ఆరెక్స్ బ్యూటీ క్రేజ్ అలా ఉంది మరి!
By: Tupaki Desk | 6 Aug 2018 12:34 PM GMTదీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని మన పెద్దోళ్ళేనాడో చెప్పారు. ఇప్పుడు డిమాండ్ అని సప్లై అని పెద్ద అర్థం కాని ఎకనామిక్స్ పదాలను వాడుతుంటారుగానీ అసలు మన టాలెంట్ తో అవతలవాళ్ళకి పనులున్నప్పుడే మనం వీలైనంతగా డబ్బు దండుకోవాలి.. దాన్ని దాచిపెట్టుకోవాలి..లేకపోతే ఆఖరుకి మన దగ్గర గోచీ కూడా మిగలదు. కాస్త కటువుగా అనిపించినా అదే నిజం. మన సంగతేమో గానే 'RX 100' సినిమాతో కుర్రకారును ఆకర్షించిన పాయల్ రాజ్ పుత్ మాత్రం ఈ సూత్రాన్ని మహా ఆత్రంగా ఆచరిస్తోంది.
అసలే ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్. ఎన్నో ముద్దులను హద్దుల్లేకుండా 'RX 100' హీరో కార్తికేయకు ఇచ్చి ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. పాయల్ బాలీవుడ్ నుండి దిగుమతి అయిన ఓ ముంబై బ్యూటీ అనే సంగతి తెలుసు కదా. మనోళ్ళకంటే డబ్బు విషయంలో వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటారు. నిన్న జీ కామెడీ అవార్డ్స్ ఈవెంట్ జరిగింది - ఆ ఈవెంట్ లో ఓ ఐదు నిముషాల పెర్ఫార్మన్స్ కోసం పాయల్ ను సంప్రదించారట. మరి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కానీ ఐదు లచ్చలు వాళ్ళ ముక్కుపిండి మరీ వసూలు చేసిందట. మీరు ఐదు లక్షలా అని ఆశ్చర్యపోవద్దు.. ఎందుకంటే ఈ అమ్మడు ఆ ఈవెంట్ కు తెచ్చే క్రేజ్ తో పోలిస్తే అది పెద్దగా ఎక్కువేం కాదు.
పింక్ కలర్ కోల్డ్ షోల్డర్ డిజైన్ లో తలపై ఓ హ్యాట్.. చేతిలో ఒక ఊత కర్రతో మెరిసిన ఆరెక్స్ బ్యూటీ తన పెర్ఫార్మన్స్ కు మాత్రం ఓ మిల మిలా మెరిసే తళుకుబెళుకుల డ్రెస్ వేసుకుంది. ఏమాటకామాట... తన ఎనర్జెటిక్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ను కట్టి పడేసింది.. ఐదు లక్షల డబ్బును తన ఎకౌంటు లో వేసుకుంది!