Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో షార్ట్ ఫిల్మ్ తో ముందుకొచ్చిన పాయల్..!

By:  Tupaki Desk   |   17 May 2020 7:15 AM GMT
లాక్ డౌన్ లో షార్ట్ ఫిల్మ్ తో ముందుకొచ్చిన పాయల్..!
X
ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన హీరోయిన్స్ వంటలు చేస్తూ.. టిక్ టాక్ వీడియోలు చేస్తూ.. వర్కౌట్స్ చేసుకుంటూ.. కొత్త కొత్త ఛాలెంజ్ లకు శ్రీకారం చుడుతూ టైంపాస్ చేస్తున్నారు. కానీ ఈ పంజాబీ బ్యూటీ మాత్రం క్వారంటైన్ టైములో షార్ట్ ఫిలిం తీసింది. ఆమె 'Rx 100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై కుర్రకారుని తనవైపు తిప్పేసుకున్న పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ బ్యూటీ యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడేలా చేసుకుంది. ఈ చిత్ర విజయంతో ఎక్కడికో వెళ్ళుపోతుందనుకున్న పాయల్ కు నిరాశే ఎదురైంది. పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయనుకున్న పాయల్ కు 'RDX 100' లాంటి చిన్న చిన్న చిత్రాలలో నటించే అవకాశం మాత్రమే దక్కింది. 'RDX 100' సినిమాలో 'Rx 100' ని మించి అందాలను ఆరబోసినప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రం దక్కించుకోలేకపోయింది. 'వెంకీ మామ' సినిమాలో వెంకటేష్ కి జోడీగా కనిపించి అలరించింది. ఆ తర్వాత రవితేజ సరసన 'డిస్కోరాజా' సినిమాలో నటించినప్పటికీ పరాజయం పలకరించింది. ప్రస్తుతం తెలుగు తమిళ్ లలో రెండు సినిమాలలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ క్వారంటైన్ టైమ్ లో డైలీ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ వచ్చిన పాయల్ ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిమ్ తో మనముందుకు వచ్చింది. కరోనా లాక్ డౌన్ లో ఎంతో మంది భర్తలు తమ భార్యల్ని గృహహింసకి గురిచేస్తున్నారని న్యూస్ వస్తున్నాయి. లాక్ డౌన్ లో వారి పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక లాక్ వేసినట్టయింది. అయితే ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా అలాంటి మహిళలకి మద్దతుగా నిలవడానికి అందరూ ముందుకు వస్తున్నారు. అయితే ఇదే అంశాన్ని తన లఘు చిత్రంలో ఎత్తి చూపింది పాయల్. 16 నిమిషాల నిడివి గల ఈ లఘుచిత్రం కేవలం 24 గంటల్లో షూట్ చేసారని తెలిపింది పాయల్. 'రైటర్ స్టోరీ చెప్పడమే కాదు.. అందులో జీవిస్తుంది' అంటూ సోషల్ మీడియాలో ఈ లఘు చిత్ర విశేషాలు చెప్పుకొచ్చింది పాయల్.

ఈ షార్ట్ ఫిలింలో పాయల్ రాజ్ పుత్ 'ప్రియా' అనే రైటర్ గా కనిపిస్తుంది. తాగుడుకు బానిసైన ఆమె భర్త రోజూ ఇబ్బంది పెడుతుండడం వల్ల రైటింగ్ మీద దృష్టి పెట్టలేకపోయేది. భర్త హింస రోజు రోజుకీ పెరిగిపోవడంతో ఒకానొక రోజు అతన్ని చంపేస్తుంది. మొత్తంగా ఇదీ స్టోరీ. ''ఎ రైటర్'' అనే టైటిల్ తో విడుదల చేసిన ఈ షార్ట్ ఫిలిమ్ కాన్సెప్ట్ బాగుందని ప్రశంసలు దక్కుతున్నాయి. దేనిలో పాయల్ రాజ్ పుత్ మేకప్ కూడా లేకుండా కనిపించడం విశేషం. లైటింగ్ కూడా పాయల్ స్వయంగా సెట్ చేసుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ ని పాయల్ ప్రియుడు సౌరభ్ ధింగ్రా దర్శకత్వం వహించాడు. ఇంటి వద్దే ఉన్న అన్ని సౌకర్యాలతో చాలా పకడ్బందీగా చెప్పాల్సిన పాయింట్ చాలా కరెక్ట్ గా చూపించారని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి లాక్ డౌన్ లో కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా పాయల్ ప్రేక్షకులకి దగ్గరవుతోంది.