Begin typing your search above and press return to search.

RX100 బ్యూటీ షాకిచ్చే డిమాండ్

By:  Tupaki Desk   |   27 May 2019 4:29 AM GMT
RX100 బ్యూటీ షాకిచ్చే డిమాండ్
X
యువ‌క‌థానాయిక‌లు షాక్ ల మీద షాక్ లిస్తున్నారు. ఒక‌ట్రెండు ఆఫ‌ర్ల‌తోనే పారితోషికాలు క‌ళ్లు భైర్లు క‌మ్మే రేంజుకు చేరిపోతున్నాయ‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. మొద‌టి సినిమాకి 3ల‌క్ష‌ల పారితోషికం అందుకున్న ఓ యంగ్ హాట్ బ్యూటీ రెండో సినిమాకి అందుకు 15 రెట్లు అధికంగా అందుకుంటోంది. అంటే రెండో సినిమాకే 40 -45 ల‌క్ష‌లు అందుకుంటోంది. ఇంకా ఆ సినిమా రిలీజ్ కానే లేదు. ఈలోగానే మూడో సినిమాకి ఆల్ మోస్ట్ డ‌బుల్ పారితోషికం పెంచేయ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆవిడ కోట్ చేసిన మొత్తానికి మ‌న నిర్మాత‌ల‌కు క‌ళ్లు భైర్లు క‌మ్మాయ‌ట‌. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ ఇది. ఇంత‌కీ ఎవ‌రావిడ‌? అంటే ఇంకెవ‌రూ.. ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్.

అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డు చెప్ప‌ని బోల్డ్ బ్యూటీగా పాయ‌ల్ కి టాలీవుడ్ లో గుర్తింపు ఉంది. ఆరంభ‌మే ఆర్.ఎక్స్ 100 చిత్రంలో బెడ్ రూమ్ స‌న్నివేశాలు.. పెద‌వి ముద్దులతో యూత్ గుండెల్ని కొల్ల‌గొట్టింది. మొద‌టి సినిమాతోనే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన ఈ అమ్మ‌డికి వ‌రుస‌గా కిర్రెక్కించే ఆఫ‌ర్లు వ‌చ్చి ప‌డ్డాయ్. ఎన్టీఆర్ - కథానాయ‌కుడు.. సీత చిత్రాల్లో స్పెష‌ల్ అప్పియ‌రెన్సులు ఇచ్చింది. అలాగే విక్ట‌రీ వెంక‌టేష్ - నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న `వెంకీ మామ‌` చిత్రంలో ఓ క‌థానాయిక‌గా ఆడిపాడుతోంది. ఈ సినిమాకి ఏకంగా 45 ల‌క్ష‌ల పారితోషికం ముడుతోందట‌.

ఈలోగానే న‌ట‌సింహా నంద‌మూరి బాల‌య్య‌- కె.ఎస్.ర‌వికుమార్ మూవీలో ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే పాయ‌ల్ డిమాండ్ విన్న త‌ర్వాత నిర్మాత‌ల‌కు క‌ళ్లు భైర్లు క‌మ్మాయ‌ట‌. ఈ మూవీ కోసం ఏకంగా 75ల‌క్ష‌ల పారితోషికం డిమాండ్ చేసింద‌ట‌. షాక్ తిన్న నిర్మాత‌లు వేరొక భామ కోసం వెతుకుతున్నార‌ని తెలుస్తోంది.

అయితే పాయ‌ల్ ప్ర‌స్తుత స‌న్నివేశమేంటి? అంటే... మూడు భాష‌ల్లో బిజీయెస్ట్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఓవైపు మాతృభాష పంజాబీలో బిజీ. మ‌రోవైపు తెలుగు- త‌మిళం- హిందీలోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. ఆర్‌ డిఎక్స్ - ఏంజెల్ (తమిళ్)- మ‌న్మ‌ధుడు 2 చిత్రాల్లోనూ న‌టిస్తోంది. వీటితో పాటే ర‌వితేజ డిస్కో రాజాకు పాయ‌ల్ నాయిక‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ కెళుతుందా వెళ్లదా? అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్పుడైనా అర్థ‌మైందా.. అంత ఎందుకు డిమాండ్ చేసిందో?