Begin typing your search above and press return to search.
పాయల్ ని డీఫేమ్ చేసే కుట్ర?
By: Tupaki Desk | 22 March 2020 11:46 AM ISTఅసలు సినిమాలే లేఖ ఖాళీగా గోళ్లు గిల్లుకునే పరిస్థితి.... ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ అవకాశం వెతుక్కునే సన్నివేశం ఆల్మోస్ట్ వచ్చేసింది. అయితే ఈలోగానే ఫలానా స్టార్ హీరో సరసన ఫలానా హీరోయిన్ అంటూ ప్రచారం సాగిపోతుంది. అలా మరోసారి ఖాళీగా ఉన్న హీరోయిన్ పేరు పబ్లిక్ లోకి వెళ్లిపోతుంది. ఆ నోటా ఈనోటా ఆ మాట సదరు హీరోగారికి చిత్రబృందానికి తెలుస్తుంది. అప్పుడు ఈ ఆలోచన సరైనదే కదా! అని ఆలోచించుకునే స్కోప్ దక్కుతుంది.
ఒకవేళ పిలిచి అవకాశం ఇస్తే జాక్ పాట్ తగిలేసినట్టే. పాపం .. పాయల్ అలానే సెల్ఫ్ పబ్లిసిటీ కోరుకుందట. ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడి ఫలానా స్టార్ హీరో సరసన ఛాన్స్ అంటూ తన వెనక పనిమంతుల బలగంతో ప్రచారం చేయించిందట. దీంతో నందమూరి బాలకృష్ణ సరసన అవకాశం దక్కింది అంటూ ఒకటే మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. అయితే అట్నుంచి ఎలాంటి స్పందనా లేదని కూడా తెలిసింది.
ఇక ఈ సీన్ చూశాక.. పాయల్ స్వయంగా ఆందోళనను వ్యక్తపరిచింది. అసలు బాలకృష్ణ సర్ సరసన నాకు అవకాశమే రాలేదు. ఆ ప్రచారం అంతా ఉత్తుత్తే! అంటూ చెప్పుకొచ్చింది. ఇది కూడా మరో రకంగా సీక్వెన్స్ తరహా ప్రచారమేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకీ మామ హిట్టు అన్న ప్రచారం తర్వాత కూడా పాయల్ ని ఎవరూ పట్టించుకోలేదు. ఇక తనకు ఐటెమ్ నంబర్లు అయినా దక్కుతాయా లేదా? అన్న ఆందోళన తో కాస్త కంగారుగానే ఉందట. ఆర్.ఎక్స్ 100 లాంటి ప్రామిస్సింగ్ ఆఫర్ మరోటి తగిలే వరకూ పాయల్ సన్నివేశం ఇలానే ఉంటుందేమో. ఇకపోతే ఆర్డీఎక్స్ లాంటి అవకాశం ఎప్పటికీ రాకూడదని పాయల్ అభిమాన భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు మరి.