Begin typing your search above and press return to search.

బ్యూటీకి ఆఫ‌రిచ్చి.. నాకేంట‌ని అడిగాడ‌ట‌!

By:  Tupaki Desk   |   30 Nov 2018 4:56 AM GMT
బ్యూటీకి ఆఫ‌రిచ్చి.. నాకేంట‌ని అడిగాడ‌ట‌!
X
కంటికి క‌నిపించిందే నిజ‌మ‌ని న‌మ్మ ఫిక్స్ కావ‌టం మామూలే. వెండితెర మీద వెలిగిపోయే అందాల భామ‌ల మైండ్ సెట్ ను.. తెర మీద వారు నటించే పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లుగా ఫిక్స్ కావ‌టం మొద‌ట్నించి ఉన్న‌దే. వెండితెర మీద అందాలు విర‌జిమ్మినంత మాత్రాన‌..తెర వెనుక అదే తీరుతో వ్య‌వ‌హ‌రిస్తార‌న్న భావ‌న‌కు మించిన స్టుపిడిటీ మ‌రొక‌టి ఉండ‌దు. కానీ.. పాడు లోకం అంత‌కు మించి మెచ్యూర్డ్ గా ఆలోచించ‌దు క‌దా?

తాజాగా అలాంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది ఆర్ ఎక్స్ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్‌. ఆమె అనుకున్న‌ట్లే ఆర్ ఎక్స్ 100 మూవీతో ఆమెకు.. ఆమె అందాల‌కు మంచి పేరే వ‌చ్చింది. పాపుల‌ర్ అయ్యింది. అయితే.. మ‌రిన్ని అవ‌కాశాలే రాని ప‌రిస్థితి. ఒక వేళ వ‌చ్చినా.. ఆమె గ‌త సినిమా మాదిరి అందాల ఆర‌బోత‌కు.. వేడి పుట్టించే స‌న్నివేశాల కోస‌మే అడుగుతున్నార‌ట‌.

త‌న‌లోని న‌టిని గుర్తించ‌కుండా.. తాను చేసిన ఇందు పాత్ర‌నే గుర్తుంచుకొని త‌న‌తో మాట్లాడుతున్న తీరుపై పాయ‌ల్ గుస్సా అవుతున్నారు. తెర మీద బోల్డ్ గా కిస్సుల మీద కిస్సులు ఇచ్చేసిన పాయ‌ల్‌.. త‌మ‌ది సంప్ర‌దాయ‌మైన కుటుంబ‌మ‌ని.. న‌టిగా త‌న‌కున్న ఫ్యాష‌న్ కోస‌మే అలాంటి పాత్ర‌ను చేశానో కానీ.. రీల్ కు రియ‌ల్ కు ఏ మాత్రం సంబంధం లేద‌ని చెబుతున్నారు. త‌న‌కు ఓప‌క్క అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లే చెప్పిన ఆమె.. త‌న‌కొచ్చే ఛాన్సుల గురించి ఆమె చెబుతున్న తీరు వింటే అయ్యో అనుకోకుండా ఉండ‌లేం.

తాజాగా ఆమెకో ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఛాన్స్ గురించి మాట్లాడిత‌న త‌ర్వాత‌.. మ‌రి.. నాకేంటి? అని అడిగేయ‌టంపై పాయ‌ల్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. అత‌డి మాట‌ల‌తో షాక్ కు గురైన తాను.. కోపంతో నాకేంటి అన్న వ్య‌క్తి రెండు చెంప‌ల్ని వాయించి పారేయాల‌ని తాను అనుకున్న‌ట్లుగా చెప్పారు.

త‌న‌ను అవ‌మానించేలా మాట్లాడిన అత‌డి మాట‌ల‌తో వ‌చ్చిన కోపాన్ని అతి క‌ష్ట‌మ్మీద కంట్రోల్ చేసుకున్న‌ట్లుగా చెప్పారు. అంతేకాదు.. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని.. అది బ‌హిరంగ ర‌హ‌స్యంగా ఆమె తేల్చేశారు. త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకున్న త‌ర్వాత కూడా త‌న‌ను క్యాస్టింగ్ కౌచ్ భూతం వెంటాడ‌టంపై ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిజ‌మే.. ఒక హిట్ ప‌డ్డాక కూడా.. ఇలాంటి చేదు అనుభ‌వాలు ఎదురైతే ఎవ‌రికైనా ఒళ్లు మండ‌టం ఖాయం.