Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బోల్డ్ భామ బ్యూటిఫుల్ పోజు

By:  Tupaki Desk   |   4 Oct 2019 1:30 AM GMT
ఫోటో స్టొరీ: బోల్డ్ భామ బ్యూటిఫుల్ పోజు
X
'RX100' విజయంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గుర్తింపు సాధించిన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బోల్డ్ బ్యూటీ అనే పేరు తెచ్చుకున్న పాయల్ కు చేతిలో ఫుల్లుగానే ఆఫర్లు ఉన్నాయి. సినిమాలతో పాయల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాను ఓరచూపు చూడడం మాత్రం మానదు. ఆ చూపుతో నెటిజన్ల హృదయాలను కాల్చుకుతినకుండా ఊరుకోదు.

పాయల్ రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మమాస్ లిల్ డాటర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కూతురు అయినా కొడుకు అయినా అమ్మకు ఎప్పుడూ చిన్నవాళ్ళే కదా. పాయల్ కూడా అలాంటి క్యాప్షనే ఇచ్చింది. ఫోటోలో స్లీవ్ లెస్ గౌన్ ధరించి చక్కగా మోడరన్ ముద్దుగుమ్మలా కూర్చుంది. వెరైటీ హెయిర్ స్టైల్.. తలకు బ్రౌన్ కలర్ కొప్పు కట్టింది. మేకప్ కొంచెం ఎక్కువే వేసుకున్నా పాయల్ కు సూట్ అయింది. ఇక పాయల్ స్మైల్ అయితే బ్యూటిఫుల్.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. 'వావ్.. బ్యూటిఫుల్ డిస్నీ ప్రిన్సెస్".. "రియల్లీ బ్యూటిఫుల్ స్వీట్ హార్ట్".. "ఇలాంటి ప్రిన్సెస్ ను కన్నందుకు అమ్మగారికి థ్యాంక్స్" అంటూ కొందరి తమ స్పందన తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే 'RDX లవ్' మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కాకుండా 'వెంకీమామ' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.