Begin typing your search above and press return to search.
పాయల్ ఇలా మంట పెడుతుందనుకోలేదు
By: Tupaki Desk | 12 Feb 2020 8:30 PM GMTవయసొచ్చాక ప్రేమించడం ఎంతో సహజం. అందరిలాగే ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ ప్రేమలో పడింది. పంజాబీ యువకుడితో డీప్ లవ్ లో ఉంది. ఇక పాయల్ పంజాబీలో పెద్ద స్టార్ అన్న సంగతి తెలిసిందే. అక్కడ లవ్ లో నిండా మునిగాకే టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే పాయల్ ఏనాడూ ఇక్కడ తన లవ్ గురించి చెప్పకపోవడంతో అందరిలో ఒకటే కన్ఫ్యూజన్. ఇక తన లవర్ గురించి ఏదీ దాచకుండానే కొన్నిటిని దాచేస్తోంది తెలివిగా.
ఇంతకుముందు ఓ ఈవెంట్లో పాయల్ చెప్పిన సంగతులు అభిమానుల గుండెల్లో మంటలు పెట్టాయి. తెలుగులో బాగా ఫేమస్ అయిపోవడంతో పంజాబీలో నటించడం తగ్గించిందిట. అయితే దానికి అక్కడ ఫ్యాన్స్ తెగ ఫీలైపోయి.. ఇక పంజాబీలో నటించరా? అని పదే పదే అడుగుతుంటారని తెలిపింది. పంజాబీలో తాను పెద్ద స్టార్ ని అని గుర్తు చేస్తూనే ఇటీవలే ధడక్ రీమేక్ లో నటించానని వెల్లడించింది.
ఇక తన ప్రియుడి కి బర్త్ డే విషెస్ చెబుతూ.. ``నా తప్పొప్పులను ప్రేమించే ఏకైక వ్యక్తి నీవు. ప్రత్యేకించి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకంటే గొప్ప ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. మనం కలిసి ఉన్న ప్రతీక్షణాన్ని గుండెల్లో దాచుకుంటాను. నా జీవితంలోని సంతోషం... ప్రశాంతత నీవల్లనే. అందుకు నేనెప్పుడు కృతజ్ఞారాలినే. హ్యాపీ బర్త్ డే మేరీ జాన్`` అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి అభిమానులు గుండెల్ని పగలగొట్టావ్ అంటూ తెగ ఇదైపోయారు. ఇంతకీ అతడు ఎవరు.. నీ బాయ్ఫ్రెండేనా? మీ మధ్య బంధం ఏమిటి? అని ప్రశ్నించడం విశేషం. పాయల్ నటించిన వెంకీమామ ఇటీవలే రిలీజై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పాటే పలు క్రేజీ చిత్రాలకు పాయల్ సంతకాలు చేసింది.