Begin typing your search above and press return to search.

'బంగార్రాజు'లో పాయల్ హాట్ హాట్ ఐటమ్?

By:  Tupaki Desk   |   20 May 2021 1:30 AM
బంగార్రాజులో పాయల్ హాట్ హాట్ ఐటమ్?
X
పాయల్ రాజ్ పుత్ పేరు చెబితే చాలు, నీరసంతో ఉన్న కుర్రాళ్లలో చెరుకు రసం తాగినంత చైతన్యం వస్తుంది. నిరాశలో కొట్టుకుంటున్న మనసులు మంచాల మీద నుంచి లేచి ఉత్సాహంతో ఉరకలు వేస్తాయి. పాయల్ పడుచుదనంలో అంతటి శక్తి ఉంది .. ఆమె గ్లామర్ కి అంతటి సత్తా ఉంది. పాయల్ మంచి పొడగరి .. అందాలను బంధించడానికి ఆమె పెద్దగా ఒప్పుకోదు. అందువలన ఆమెపై రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా పండుతాయి.

పట్నం పిల్లలా అందంగా కనిపించడం .. పల్లె పిల్లలా ఆకర్షణీయంగా అనిపించడం పాయల్ ప్రత్యేకత. పాయల్ చూపును .. ఆ చూపుల్లోని కైపును మరిచిపోవడం కుర్రాళ్లవల్ల కాదు. ఆ మత్తు చూపులపై ఎలాంటి మాత్రలు పనిచేయవు. పాయల్ సొగసుల సందడి .. ఆ నెమలి నడకలు .. హంస వయ్యారాలు చూసినవాళ్లు ఈ అమ్మాయి ఐటమ్ సాంగ్ చేస్తే అదిరిపోతుందని అనుకున్నారు. అంతే .. 'సీత' సినిమాలో ఆమె ఐటమ్ చేసేసింది.

'బుల్లెట్టుమీదొచ్చే బుల్ రెడ్డి .. ' అంటూ ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మళ్లీ ఇప్పుడు ఆమె మరోసారి ఐటమ్ సాంగ్ లో రెచ్చిపోనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' రూపొందనుంది. వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ తో ఒక ఐటమ్ చేయించాలనుకుంటున్నారట. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కావడం వలన, ఆమె లుక్ కరెక్ట్ గా సెట్ అవుతుందని అనుకుంటున్నారట. అదే జరిగితే పాయల్ చిందులు .. కుర్రాళ్లకు మరోసారి విందులే చేయనుంది.