Begin typing your search above and press return to search.
దానికి సై అన్న పాయల్ రాజ్ పుత్!
By: Tupaki Desk | 29 Jan 2019 2:45 PM GMTమన తెలుగు సినిమాల్లో ఉండే కమర్షియల్ చాలా ఎలిమెంట్స్ లో ఐటెం సాంగ్ కూడా ఒకటి. పెద్ద హీరో సినిమా అయినా కుర్ర హీరో సినిమాలయినా ఐటెం సాంగ్ కనుక ఉంటే అది మాస్ ఆడియన్స్ ను ఆకర్షించేందుకు ఒక అస్త్రంగా పనిచేస్తుందని ఫిలింమేకర్స్ నమ్ముతారు. సీనియర్ ఫిలింమేకర్ తేజ కూడా అందుకు భిన్నమేమీ కాదు. పైగా ఐటెం సాంగ్ లేకుండా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా దాదాపుగా ఉండదు. 'అల్లుడు శీను'.. 'స్పీడున్నోడు' లో తమన్నాతోనూ.. 'జయ జానకి నాయక' లో క్యాథరిన్ తోనూ ఆడిపాడాడు బెల్లంకొండ బాబు. అందుకే తేజ - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సీత' కోసం ఒక మాస్ మసాలా ఐటెం నంబర్ ను ప్లాన్ చేశారట.
ఈ ప్రత్యేక గీతం కోసం 'RX100' హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారట. మొదటి సినిమాతోనే నటన పరంగానూ.. బోల్డ్ యాక్టింగ్ తోనూ ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసింది పాయల్. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్లలో పాయల్ ముందువరుసలో ఉంటుంది. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ తో స్టెప్పులు వేసేందుకు ఈ అమ్మడిని ఫైనలైజ్ చేశారని సమాచారం. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ పాటకు ఓ క్యాచీ మాస్ ట్యూన్ ను కంపోజ్ చేసి పనిలో బిజీగా ఉన్నాడట. త్వరలోనే ఈ ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తారట.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. మన్నార చోప్రా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమధ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ఈ సినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.