Begin typing your search above and press return to search.

#పాయ‌ల్‌ ఫ్యాంటు మీద ఫ్యాంటు తొడిగిందా?

By:  Tupaki Desk   |   7 April 2021 1:30 AM GMT
#పాయ‌ల్‌ ఫ్యాంటు మీద ఫ్యాంటు తొడిగిందా?
X
ప్ర‌స్తుత ట్రెండీ వ‌ర‌ల్డ్ లో ఫ్యాష‌న్ అనేది ఒక‌రి సొత్తు కాదు. ఎవ‌రికి వారు ఎవ్వ‌ర్ లేటెస్ట్ ట్రెండ్ తో కొత్త‌ద‌నానికి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. బాలీవుడ్ లో సోన‌మ్ క‌పూర్ - జాన్వీ క‌పూర్ సిస్ట‌ర్స్ .. ఆలియా భ‌ట్.. దీపిక లాంటి భామ‌లు ఫ్యాష‌న్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకునేవారు. కాల‌క్ర‌మంలో దిశా ప‌టానీ.. ప్ర‌గ్య జైశ్వాల్ లాంటి భామ‌లు సోష‌ల్ మీడియాల్లో దుమారం రేప‌డం మొద‌లైంది.

ఈ కేట‌గిరీలో సౌత్ నుంచి కూడా ప‌లువురు భామ‌లు చేరుతున్నారు. గ‌త కొంత‌కాలంగా ఆర్.ఎక్స్ 100 బ్యూటీ కూడా వ‌రుస‌గా ఇన్ స్టా ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ప‌రంగా ఆశించినంత మెరుగైన రిజ‌ల్ట్ క‌నిపించ‌క‌పోయినా.. ఫోటోషూట్ల‌తో వేడి పెంచ‌డంలో ఈ అమ్మ‌డు ముందుంటోంది.

తాజాగా పాయ‌ల్ ఓ ఆస‌క్తిక‌ర డిజైన‌ర్ వేర్ తో ఆక‌ర్షించింది. బ్లూ డెనిమ్ జీన్స్ ఒక‌దానిపై ఒక‌టిగా ధ‌రించిందా? అనిపించేలా సంథింగ్ కొత్త‌గానే ట్రై చేసింది. దానికి కాంబినేష‌న్ గా ఎర్ర‌ గులాబీ రంగు టాప్ తో అద‌ర‌గొట్టింది. ఈ డిజైన‌ర్ లుక్ లో పాయ‌ల్ పిక్చ‌ర్ పర్ఫెక్ట్ గా క‌నిపిస్తోంది అంటూ కితాబు అందుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పాయ‌ల్ ప్ర‌స్తుతం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి సంత‌కం చేసింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. దీనికి అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. త‌మిళంలో యాంజెల్ అనే చిత్రంలో న‌టిస్తోంది. ఉద‌య‌నిధి స్టాలిన్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.