Begin typing your search above and press return to search.
పాయల్ లాక్ డౌన్ ని ఉల్లంఘించిందా?
By: Tupaki Desk | 2 April 2020 2:40 PM ISTప్రపంచం లాక్ డౌన్.. దేశం లాక్ డౌన్.. రాష్ట్రం లాక్ డౌన్.. జిల్లాలు లాక్ డౌన్.. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఎవరైనా ఇల్లు కదిలి బయటకి వెళ్లగలరా? కానీ పాయల్ ఇల్లు వదిలి పార్క్ కి వెళ్లింది. అక్కడ అదిరిపోయే ఫోటోషూట్లో పాల్గొని ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అమ్మడి వ్యవహారం చూస్తుంటే లాక్ డౌన్ నియమం ఉల్లంఘించినట్టే కనిపిస్తోంది.
ఇంటికి సమీపంలోని పార్క్ అయినా ఈ క్రైసిస్ లో అలా వెళ్లడం కరెక్టేనా? పదిమందికి నీతులు చెప్పే సెలబ్రిటీలు తాము మాత్రం పాటించరా? ప్చ్?... ఏదయితే మనకెందుకు అనుకోవడానికి లేదిక్కడ. కచ్ఛితంగా పాయల్ ఇలాంటి సమయంలో నియమం పాటిస్తే బావుండేది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫోటోషూట్ల కోసం ప్రచారం కోసం ఇలా లొకేషన్లు వెతుక్కుంటూ వెళితే ఎలా అమ్మడూ? అంటూ కామెంట్లు ఎక్కువై పోతున్నాయ్.
ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయాలన్న ఆలోచన మంచిదే కానీ.. దానికి నియమం నిష్ఠ అవసరం. ఇకపోతే ఇటీవల సినిమాల్లేక గిలగిలా కొట్టుకుంటున్న పాయల్ కి నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన ఛాన్స్ దక్కిందని ప్రచారమైంది. ఇంతలోనే నాకెవరూ అవకాశం ఇవ్వలేదు.... ఇస్తే బావుణ్ణు అంటూ కవర్ చేసేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రవితేజ తో డిస్కోరాజా లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు లో ఓ సినిమా చేస్తోంది. తమిళం లో `ఏజెంట్` అనే సినిమాలోనూ పాయల్ నటిస్తోంది. అయితే పెద్ద స్తాయి స్టార్లు ఎవరూ పాయల్ కి అవకాశం ఇవ్వకపోవడం తన క్రేజ్ ని దిగజారుస్తోంది.