Begin typing your search above and press return to search.

కుర్రాళ్ల గుండెల్లో మోగే ఘల్ ఘల్ .. పాయల్!

By:  Tupaki Desk   |   17 March 2021 10:30 AM GMT
కుర్రాళ్ల గుండెల్లో మోగే ఘల్ ఘల్ .. పాయల్!
X
ఆకాశాన్నీ .. అగాధాలను చూడటానికి రెండు కళ్లు సరిపోతాయేమోగానీ, అసలైన అందాన్ని చూడటానికి రెండు కళ్లు ఎలాంటి పరిస్థితుల్లోను చాలవు. మల్లెతోటలను .. మంచు పర్వతాలను చూస్తూ అనుభూతి చెందటానికి ఒక మనసు సరిపోతుందేమోగాని, మంచి ముత్యంలాంటి అమ్మాయి అందాన్ని ఆస్వాదించడానికి ఒక మనసు చాలదు. ఊహలకు రెక్కలు తగిలించే అందాలను .. ఉత్సాహానికి ఉరుకులు నేర్పే అందాలను చూపులతో స్పర్శించాలంటే, డజను కళ్లైనా కావాలి .. అరడజను మనసులనైనా అరువు తేవాలి.

అందం .. గంధం ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన పనిలేదు. ఎందుకంటే ఎక్కడా ఉన్నా అవి మనసును లాగుతూనే ఉంటాయి .. గుండె గదుల్లో కలల ఊయల వేసుకుని ఊగుతూనే ఉంటాయి. అదిగో అలా ఇక్కడ పాయల్ గంధంతో చేసిన గంధర్వకన్యలా .. తేనెవానలో తడిసిన తెల్లమందారంలా కనిపిస్తోంది. వెన్నెల్లో విరిసిన వేయి రేకుల తామరలా అనిపిస్తోంది. ఆమె కన్నుల్లోకి చూస్తూ అక్షరాలకు అందని భాషను నేర్చుకోవచ్చు. ఆమె పెదాల పీటలపై కూర్చుని పడుచు పాటలను రాసుకోవచ్చు.

పాయల్ చేసిన సినిమాలను వ్రేళ్లపై లెక్కపెట్టవచ్చు .. అందులో హిట్ అయినవి వ్రేళ్లపై కూడా లెక్కపెట్టనవసరం లేదు. పోనీ అన్ని భాషల్లో కలుపుకుని ఓ అరడజను సినిమాలైనా ఆమె చేతిలో ఉన్నాయా అంటే అవీ లేవు. మరి ఎందుకు ఆ అమ్మాయికి అంతటి క్రేజ్ అంటే .. సెగలు చిమ్మే సౌందర్యం అనే మాటనే కుర్రాళ్లందరి నుంచి వచ్చే సమాధానం. పాయల్ నీడ పడితేచాలు పచ్చగడ్డి కూడా పరిమళిస్తుందని వాళ్లంతా వాదిస్తారు. వాళ్లంత బలంగా చెబుతున్నారంటే .. నిజమే అయ్యుంటుందేమో. పాయల్ ఇలా సోషల్ మీడియాలో తన ఫొటోను వదిలేసి, కుర్రాళ్లందరినీ కూర్చోబెట్టేసి చూచిరాత రాయించినట్టుగా తనపై కవితలు రాయించేస్తోంది. అందగత్తెలు రాజ్యాలనే రాయించుకున్నారు .. ఇక కవితలు రాయించుకోవడంలో వింతేముంది?