Begin typing your search above and press return to search.

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటోంది

By:  Tupaki Desk   |   2 Aug 2020 4:10 AM GMT
చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటోంది
X
పాయల్ రాజ్‌పుత్ అనే కంటే ఆర్.ఎక్స్ 100 బాంబ‌ర్!! అంటేనే కుర్ర‌కారు వెంట‌నే గుర్తు ప‌ట్టేస్తారు. న‌టించిన తొలి చిత్రం త‌న‌కు అంత చ‌క్క‌ని గుర్తింపు తెచ్చింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోలే పిలిచి అవ‌కాశం ఇచ్చారు. విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న‌ వెంకీ మామ.. రవితేజ స‌ర‌స‌న‌ డిస్కో రాజా చిత్రాల్లో న‌టించింది. కానీ ఎందుక‌నో పెద్ద సినిమాల‌తో త‌న‌కే గుర్తింపూ ద‌క్క‌లేదు. పైగా అవ‌కాశాల్లేకుండా పోయాయ్. న‌వ‌త‌రంలో ఫేడ‌వుట్ బ్యూటీగా అప్పుడే ముద్ర ప‌డిపోయింది.

అందుకే ఇటీవ‌ల ఏ ఆఫ‌ర్ వ‌చ్చినా వెంట‌నే ఓకే చెప్ప‌డం లేద‌ట‌. ఐటెమ్ నంబ‌ర్లలో ఆఫ‌ర్లు వ‌స్తున్నా పాయ‌ల్ చికాకు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ట‌. కెరీర్ బండిని ఎలా ప‌రుగులు పెట్టించాలి? అన్న త‌ప‌న‌తో చాలా ఆఫ‌ర్లు ఇటీవ‌ల కాల‌ద‌న్నుకుంద‌‌ట‌. లాంగ్ ర‌న్ ఉండాలంటే ఇప్ప‌టికి అయినా చేసిన త‌ప్పులు గ్రహించి వాటిని స‌రిదిద్దుకోవాల‌ని భావిస్తోంద‌ట‌. అయితే అంతా అయిపోయాక ఏం లాభం? చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఎలా? అన్న‌దే ఇప్పుడు క్రిటిక్స్ మాట‌.

ఆర్డీఎక్స్ లాంటి డీగ్రేడ్ చిత్రానికి అంగీక‌రించిన‌ప్పుడే పాయ‌ల్ భ‌విత‌వ్యంపై హెచ్చరించారంతా. ఆ డిజాస్ట‌ర్ మూవీ ప్ర‌భావం అంతా ఇంతా కాదు. ఈరోజుల్లో కేవ‌లం గ్లామ‌ర్ ని ఆర‌బోత‌ని న‌మ్ముకుంటేనే స‌రిపోదు. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న‌వి వెతుక్కోవాలి. అందుకే ఇప్పుడు కొత్త దారిని ఎంచుకుంటోంద‌ట‌. పాయ‌ల్ న‌టిస్తున్న త‌మిళ చిత్రం యాంజెల్.. తెలుగు చిత్రం న‌రేంద్ర అప్ డేట్స్ తెలియాల్సి ఉంది.